కరోనా భయం... యూకేలో కూతురిని చంపేసిన తల్లి

By telugu news teamFirst Published Jun 26, 2021, 9:43 AM IST
Highlights

తాను కూడా కరోనాతో చనిపోతానని భయపడిపోయింది. తాను చనిపోయిన తర్వాత.. తన కూతురు ఏమైపోతుందనే భయం కూడా ఆమెలో మొదలైంది. ఈ క్రమంలో... కుమార్తెను చంపేసింది.

యూకేలో ఓ భారతీయ మహిళ.. తన ఐదేళ్ల కుమార్తెను అతి దారుణంగా చంపేసింది. కరోనా కారణంగా తాను చనిపోతే.. తన కూతురు తాను లేకుండా బతకలేదనే భయంతో చంపేయడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన సుతా శివన్నాథం అనే మహిళ తన కూతరు సెయాగి తో కలిసి లండన్ లో స్థిరపడింది. కాగా.. గతేడాదిద జూన్ 30వ తేదీన సదరు మహిళ.. ఆమె ఐదేళ్ల కుమార్తెను దాదాపు 15సార్లు కత్తితో పొడిచి చంపేసింది. 

గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. ఈ క్రమంలో.. సుతా శివన్నాథం వైరస్ పట్ల తీవ్ర భయాందోళనలకు గురైంది. తాను కూడా కరోనాతో చనిపోతానని భయపడిపోయింది. తాను చనిపోయిన తర్వాత.. తన కూతురు ఏమైపోతుందనే భయం కూడా ఆమెలో మొదలైంది. ఈ క్రమంలో... కుమార్తెను చంపేసింది.

సుతా శివన్నాథంకు 2006లో వివాహం జరిగింది. భర్తతో కలిసి లండన్ లో స్థిరపడ్డారు. అయితే.. ఆమెకు ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో.. ఈ అనారోగ్య సమస్యలకు తోడు కరోనా కూడా వస్తే.. తాను బతకనని ఆమె భావించింది. అందుకే.. ఆ మహమ్మారి రాకముందే.. కూతురిని చంపేసి.. తాను కూడా చనిపోవాలని అనుకుంది.

కూతురిని దారుణంగా 15సార్లు పొడిచి చంపేసి.. ఆ తర్వాత తాను కూడా తీవ్రంగా గాయపరుచుకుంది. తాను ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ఈ దుర్ఘటన జరిగిందని.. ఆమె భర్త కోర్టులో వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా మానసికంగా దెబ్బతినడం వల్లే ఆమె ఇలా చేసిందని అతను కోర్టు ముందు పేర్కొన్నాడు. తన భార్య మానసిక పరిస్థితి సరిగా ఉంటే.. ఇలా జరిగేది కాదని ఆయన పేర్కొన్నాడు. 
 

click me!