మహిళల పట్ల అసభ్యంగా: ఆస్ట్రేలియాలో భారత యోగా గురు అరెస్టు

By telugu team  |  First Published May 8, 2019, 8:37 PM IST

రూటీ హిల్‌లో 2016లో ఓ ప్రార్ధనా సమావేశానికి హాజరైన ఆనంద్‌ గిరి ఓ మహిళను వేధించారని, 2018 నవంబర్‌లో మరో ఘటనలో 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.


సిడ్నీ: యోగా, ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న స్వామి ఆనంద్‌ గిరి అస్ట్రేలియాలోని సిడ్నీలో అరెస్టయ్యాడు. ఇద్దరు మహిళా శిష్యులను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు అతన్ని అరెస్టు చేశారు. 

రూటీ హిల్‌లో 2016లో ఓ ప్రార్ధనా సమావేశానికి హాజరైన ఆనంద్‌ గిరి ఓ మహిళను వేధించారని, 2018 నవంబర్‌లో మరో ఘటనలో 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.

Latest Videos

undefined

అస్ట్రేలియాలో ఆరు వారాల పర్యటనలో ఉన్న ఆనంద్‌ గిరిని మే 5న సిడ్నీలో అరెస్ట్‌ చేశారు. ఆనంద్‌ బెయిల్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు కస్టడీకి తరలించింది. జూన్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్‌ ఆలయంలో ఆనంద్ గిరి మహంత్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆనంద్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఆయన పలువురు ప్రముఖ నేతలతో కలిసి ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. అతను ప్రస్తుతం యోగ తంత్రలో పిహెచ్ డి చేస్తున్నాడు.

click me!