కారు డ్రైవర్ కి 40 కోట్ల జాక్ పాట్..!

By telugu news teamFirst Published Jul 5, 2021, 8:31 AM IST
Highlights

లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దాదాపు రూ.40కోట్ల లాటరీ గెలిచాడు. అయితే.. ఇదే లాటరీని ఇతనితోపాటు మరో 9మంది కూడా గెలుచుకున్నారు. 

కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తూ.. చాలీ చాలని డబ్బులతో కుటుంబాన్ని పోషించే ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దాదాపు రూ.40కోట్ల లాటరీ గెలిచాడు. అయితే.. ఇదే లాటరీని ఇతనితోపాటు మరో 9మంది కూడా గెలుచుకున్నారు. దీంతో.. ఒక్కొక్కరికీ రూ.4కోట్ల వరకు లాటరీ ఎమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్(37) కుటుంబ పోషణ కోసం అబుదాబి వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్ గా పనిచేస్తూ.. ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఇటీవల అతనికి లాటరీ తగిలింది. ఈ క్రమంలో.. అతను కొన్న లాటరీ రూ.40కోట్లు గెలుచుకోవడం గమనార్హం. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు.

అయినప్పటికీ అతనికి రూ.4కోట్లు వస్తుండటం విశేషం. ఇంత డబ్బు గెలుచుకోవడం పట్ల సోమరాజన్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇంత జాక్‌పాట్‌ తగులుతుందని ఊహించలేదన్నాడు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చానని చెప్పాడు. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారానన్నాడు.

‘ఎప్పటికైనా అదృష్టం కలిసిరాదా అని చెప్పి..  లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్‌ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్‌ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు.   

click me!