ఎయిర్ పోర్టులో దొంగతనం.. ట్రంప్ మాజీ పార్ట్ నర్ అరెస్ట్

By telugu teamFirst Published Aug 27, 2019, 11:10 AM IST
Highlights

వారం రోజుల క్రితం దినేష్ చావ్లా.. మెమ్ఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను దొంగిలించాడు. సూట్ కేసులను ఎవరికీ తెలియకుండా తీసుకొని వచ్చి తన కారులో పెట్టుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతనిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. 


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ పార్ట్ నర్, భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని దొంగతనం కేసులో ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు దినేష్ చావ్లా. అమెరికాలోని చావ్లా హోటల్స్ సీఈవో. గతంలో  దినేష్ చావ్లాతో కలిసి డోనాల్డ్ ట్రంప్ హోటల్స్ బిజినెస్ లో పార్ట్ నర్ గా వ్యవహరించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు ఈ వ్యాపారంలో భాగస్వాములు అయ్యారు.

వారం రోజుల క్రితం దినేష్ చావ్లా.. మెమ్ఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను దొంగిలించాడు. సూట్ కేసులను ఎవరికీ తెలియకుండా తీసుకొని వచ్చి తన కారులో పెట్టుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతనిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఇలా సూట్ కేసులు దొంగతనం చేయడం ఇదేమీ తొలిసారి కాదని... గతంలో చాలా సార్లు ఇలా చేశాడని పోలీసులు చెబుతున్నారు.

కాగా... అతను వాటిని కేవలం థ్రిల్ కోసం మాత్రమే చేశాడని చెప్పడం విశేషం. అతను వారం క్రితం దొంగతనం చేసిన సూట్ కేసుల విలువ 4వేల డాలర్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అతని కారులో లభించిన సూట్ కేసులను స్వాధీనం చేసుకొని అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!