భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి తన అమ్మమ్మ మీద హత్యకు ప్రయత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 89యేళ్ల ఆ వృద్ధురాలు మరణించింది.
లండన్ : దక్షిణ లండన్‌లో 89 ఏళ్ల తన అమ్మమ్మను హత్య చేసిన కేసులో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిపై గురువారం అభియోగాలు మోపినట్లు స్కాట్లాండ్ యార్డ్ తెలిపింది. ఈ వారం మొదట్లో క్రోయ్‌డాన్‌లో ఈ ఘటన జరిగింది. శకుంతల ఫ్రాన్సిస్ అనే వృద్ధురాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్‌లు వెరుషన్ మనోహరన్ (31)పై అభియోగాలు మోపారు.
ఫ్రాన్సిస్ కత్తిపోట్లతో చనిపోయిన కొద్దిసేపటికే వెరుషన్ మనోహరన్ ను సంఘటనా స్థలంలో అరెస్టు చేశారు. నిందితుడిని గురువారం క్రోయిడాన్ మేజిస్ట్రేట్ కోర్టులో కస్టడీకి హాజరుపరచి, అతని మీద హత్యానేరం మోపారు. "మరణించిన వ్యక్తి, అభియోగాలు మోపబడిన వ్యక్తి అమ్మమ్మ-మనవడు అవుతారు" అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
undefined
"దీనికి సంబంధించి పూర్తి ఆధారాలకోసం విచారణలు కొనసాగుతున్నాయి. ఈ హత్యకు సంబంధించిన ఇంకెవరీకీ ఈ హత్యతో సంబంధం ఉన్నట్టుగా తెలియలేదని” పోలీసు ఫోర్స్ తెలిపింది. మంగళవారం రాత్రి లండన్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. దక్షిణ లండన్‌లోని ఓ ఇంట్లో ఓ మహిళ కత్తిపోట్లకు గురైందని వారు సమాచారం అందించారు. దీంతో మరికొంతమంది అంబులెన్స్ సిబ్బందితోపాటు.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ మహిళను శకుంతల ఫ్రాన్సిస్‌గా గుర్తించారు. 89 ఏళ్ల ఆ మహిళ అప్పటికే చనిపోయిందని అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు తెలిపారు.
"ఆమె కుటుంబానికి ఈ విషయం మీద అవగాహన ఉంది. వారు స్పెషల్ ఆఫీసర్లు మద్దతు ఇస్తున్నారు. నిర్ణీత సమయంలో పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించబడుతుందని మెట్ పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఇంకా ఎవరికైనా తెలిస్తే.. పోలీసులను సంప్రదించాలని ఫోర్స్ కూడా విజ్ఞప్తి చేస్తోంది.
ఇదిలా ఉండగా, మూడేళ్ల క్రితం మహిళపై తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన వైద్యుడికి స్కాట్లాండ్ కోర్టు జూన్ 16న నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత నెలలో ఎడిన్‌బర్గ్‌లోని హైకోర్టులో డాక్టర్ ను దోషిగా నిర్ధారించింది. ఇక స్కాటిష్ కోర్టు తీర్పు సమయంలో స్కాటిష్ పోలీసులు అతడిది "భయంకరమైన ప్రవర్తన"గా అభివర్ణించారని ఊటంకిస్తూ అదే కోర్టులో శిక్ష విధించింది. అప్పటికే వివాహం అయిన ఈ జనరల్ ప్రాక్టీషనర్ (GP) ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండెర్‌లో "మైక్"గా ఎలా పోజులిచ్చారో, డిసెంబర్ 2018లో దాడి జరిగిన స్టిర్లింగ్‌లోని ఒక హోటల్‌లో బాధితురాలిని కలిసేందుకు ఎలా ఏర్పాటు చేశారో కోర్టు సావకాశంగా విన్నది.
"లైంగిక నేరాలకు పాల్పడేవారు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. మీరు ఎప్పటికైనా పట్టుబడతారు. మీరు న్యాయస్థానం ముందు నిలబడతారు. భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. అలాంటి వారికి ఇది ఒక మెసేజ్’ అని స్కాట్లాండ్ పోలీస్ స్కాట్లాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ యూనిట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోర్బ్స్ విల్సన్ అన్నారు.
షార్ణా విమానంలో భారత ప్రవాసి మృతి... కాసేపట్లో స్వదేశానికి, అంతలోనే విషాదం...
"గిల్ ఇప్పుడు అతని భయంకరమైన ప్రవర్తనకు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాధితురాలు ముందుకు వచ్చి తన కథను చెప్పడంలో విపరీతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. మా విచారణలో ఆమె చేసిన సహాయానికి మేము ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ఫలితం ఆమెకు కొంత ఉపశమనం ఇస్తుందని ఆశిస్తున్నాను" అని విల్సన్ అన్నారు.
"లైంగిక వేధింపుల కేసులను చేధించడానికి మేము కట్టుబడి ఉన్నాము, ప్రత్యేకంగా శిక్షణ పొందిన అధికారులు మా దగ్గర ఉన్నారు. బాధితులకు మద్దతు అందించడానికి భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. లైంగిక వేధింపులు ఏ రూపంలో ఎదుర్కున్నా మాకు వెంటనే తెలియజేయాలని, వారికి తగిన భద్రత, కేసు పరిశోధన క్షుణ్ణంగా జరుతుందని హామీ ఇస్తున్నామని’ అన్నారాయన.