తొలి కరోనా టీకా పొందనున్న భారత సంతతి వ్యక్తి..!

By telugu news team  |  First Published Dec 8, 2020, 11:13 AM IST

ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. 


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. భారత సంతతికి చెందిన హరి శుక్లా అనే వ్యక్తి తొలి కరోనా టీకాను అందుకోనున్నారు. 

ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనున్న మొదటి వ్యక్తుల జాబితాలో చేరారు ఈ రోజు ఆయన యూకేలోని ఓ ఆస్పత్రిలో ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ని తీసుకోబోతున్నారు. ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. 

Latest Videos

ఈ క్రమంలో తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌ వర్కర్స్‌కి, హోం కేర్‌ వర్కర్స్‌కి వ్యాక్సిన్‌ వేస్తారు. ఈ సందర్బంగా హరి శుక్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటికైనా మహమ్మారి కట్టడికి ఓ ఆయుధం రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ పొందిన మొదటి వ్యక్తుల జాబితాలో చేరడం ఉద్వేగానికి గురి చేస్తోంది. నాకు కాల్‌ చేసి వ్యాక్సిన్‌ తీసుకునే వారి జాబితాలో నా పేరు ఉందని చెప్పినప్పటి నుంచి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. కోవిడ్‌ సంక్షోభం ముగింపుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి అయ్యింది అనే విషయం తలుచుకుంటే ఎంతో ఊరటగా ఉంది’ అన్నారు 

ఇక బ్రిటన్‌లో అత్యవసర వినియోగంలో భాగంగా మొదటి వారంలో 8 లక్షల డోసుల వ్యాక్సిన్‌లని అందుబాటులోని తీసుకురానున్నారు. కోవిడ్‌ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి, 80ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

click me!