లండన్ లో భారతీయ మూలాలున్న ఓ 72యేళ్ల డాక్టర్ 48 మంది మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డారని గ్లాస్కోలోని హైకోర్టు గురువారం తేల్చింది. అతనికి శిక్షను వచ్చే నెలలో ఖరారు చేయనున్నట్లు తెలిపింది. అంతవరకు బెయిల్ మీద విడుదల చేసింది.
లండన్ : london చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళలపై భారతీయ సంతతి వైద్యుడు ఒకరు sex offencesకు పాల్పడినట్లు తాజాగా రుజువైంది. 72 ఏళ్ల డాక్టర్ Krishna Singh బ్రిటన్లో చాలా ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆయన తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు ప్రారంభమైంది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 వరకు మొత్తం 48 మంది మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డారని గ్లాస్కోలోని హైకోర్టు గురువారం తేల్చింది. ఆయనకు వచ్చే నెలలో శిక్ష ఖరారు కానుంది.
వివరాల్లోకి వెడితే... స్కాట్లాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న 72 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన డాక్టర్ 35 ఏళ్లు పైబడిన 48 మంది మహిళా రోగులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని గురువారం లండన్ లోని కోర్టు తేల్చింది. కృష్ణ సింగ్, general practitioner (GP), అతను తన వద్దకు వచ్చే మహిళా రోగులను ముద్దులు పెట్టడం, వారిని ముట్టుకోవడం, అవసరం లేని పరీక్షలు చేయడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఈ నేరాల కింద గురువారం గ్లాస్గోలోని హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అతను తనమీద మోపిన అభియోగాలను తిరస్కరించాడు.
undefined
అంతేకాదు, అలా అనుకోవడం రోగులదే తప్పు అని.. తాను ఇండియాలో డాక్టర్ కోర్స్ చదివే సమయంలో ట్రైనింగ్ లో నేర్చుకున్న పరీక్షలే చేయించానని చెప్పుకొచ్చాడు. స్కాట్లాండ్ నుండి వచ్చిన వార్తా నివేదికల ప్రకారం, అభియోగాలు ఫిబ్రవరి 1983, మే 2018 మధ్య వచ్చాయి. నేరాలు ప్రధానంగా నార్త్ లానార్క్‌షైర్‌లోని ఆస్పత్రిలో జరిగాయి. వీటిలో పాటు ఓ ఆస్పత్రిలో ప్రమాదం జరిగిన సందర్భంలో, ఎమర్జెన్సీ సమయాల్లో, పోలీస్ స్టేషన్, రోగుల విషయంలో ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో అన్నింటికంటే హైలెట్ ఏంటంటే.. డాక్టర్ సింగ్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడమే పనిగా పెట్టుకున్నాడని.. అది అతడి రొటీన్ గా మారిపోయిందని ప్రాసిక్యూటర్ ఏంజెలా గ్రే కోర్టుకు తెలిపారు. ఆమె వాదిస్తూ... “కొన్నిసార్లు పేషంట్లకు తెలియకుండా లేదా మభ్యపెట్టి, మరికొన్నిసార్లు స్పష్టంగా వారిని అసభ్యంగా తాకేవాడు. అలా లైంగిక నేరం అనేది అతని వృత్తి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది”ఆమె చెప్పింది.
సింగ్ కు సమాజంలో మంచి గౌరవం ఉంది. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు, కృషికి గానూ రాయల్ మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) గౌరవాన్ని కూడా పొందారు. 2018లో ఒక మహిళ అతనిపై ఫిర్యాదు చేసిన తర్వాత అతని ప్రవర్తనపై దర్యాప్తు మొదలయ్యింది. బాధితులపై 54 ఆరోపణలపై డాక్టర్ దోషిగా నిర్ధారించబడ్డాడు, ప్రధానంగా బహుళ లైంగిక, అసభ్యకరమైన వేధింపులతో కూడిన నేరాలు. అయితే అతనిమీద మోపబడిన మిగతా తొమ్మిది ఇతర ఆరోపణలు రుజువు చేయబడలేదు. మరో రెండు కేసుల్లో నిర్దోషిగా తేలాడు. కేసును విచారించిన న్యాయమూర్తి శిక్షను వచ్చే నెలకు వాయిదా వేశారు. సింగ్ తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలనే షరతుతో బెయిల్‌పై విడుదల చేయడానికి అనుమతించారు.