కెనడాలో భారతీయ విద్యార్థి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య చేసినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని కెనడా పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతను శనివారం మరో హత్య కూడా చేశాడు.
కెనడా : Canadaలో 21 ఏళ్ల Indian student కార్తీక్ వాసుదేవ్‌ను కాల్చి చంపిన ఉదంతంలో అనుమానితుడిగా భావిస్తున్న 39 ఏళ్ల వ్యక్తిని arrest చేసినట్లు టొరంటో పోలీసులు మంగళవారం ప్రకటించారు. Uttar Pradeshలోని ఘజియాబాద్‌కు చెందిన మృతుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి జనవరిలో కెనడాకు వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే, murderకు గల కారణాలు తెలియకపోవడంపై అతని తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. కార్తీక్ కేసులో తీసుకుంటున్న చట్టపరమైన చర్యలను ఫాలోఅప్ చేయడానికి తాను కెనడాకు వెళతానని అతను తెలిపారు. సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్‌బోర్న్ టిటిసి స్టేషన్ గ్లెన్ రోడ్ ఎంట్రీ గేట్ వద్ద గురువారం సాయంత్రం కార్తీక్ మీద కాల్పులు జరిపాడు.
ఇది గమనించిన వారు వెంటనే కార్తీక్ ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. "కార్తీక్ గత గురువారం షెర్బోర్న్ సబ్‌వే స్టేషన్ బైట ఉన్నప్పుడు ఒక అపరిచితుడు అతడిని కలిశాడు. కార్తీక్ అతడిని ఏమీ రెచ్చగొట్టలేదు.. అయినా అతను వ్యక్తి కార్తీక్‌ను పలుసార్లు కాల్చి చంపాడు," అని టొరంటో పోలీస్ సర్వీస్ చీఫ్ జేమ్స్ రామెర్ విలేకరులతో అన్నారు. నిందితుడిని రిచర్డ్ జోనాథన్ ఎడ్విన్‌గా పోలీసులు గుర్తించారు. రిచర్డ్ గత శనివారం కూడా మరో హత్యకు పాల్పడ్డాడు.
ఎడ్విన్ బారిన పడిన రెండవ బాధితుడు ఎలిజా ఎలియాజర్ మహేపత్ (35), అతను జార్జ్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. రెండు హత్యలు చేసిన ఈ నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, ఈ సంఘటనలను అతడు "యాదృచ్ఛిక దాడులు"గా అభివర్ణించాడని పోలీసులు చెప్పుకొచ్చారు.
హోమిసైడ్ డిపార్ట్‌మెంట్, టొరంటో పోలీస్ డిటెక్టివ్ సార్జెంట్ టెర్రీ బ్రౌన్ మాట్లాడుతూ, కార్తీక్ మీద అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో అతను ఎలా తప్పించుకోవాలో కూడా తేల్చుకునే టైం లేకుండా పోయిందన్నారు. ఈ రెండు హత్యల వెనుకున్న అనుమానితుడికి ఎలాంటి నేరచరిత్ర లేదని బ్రౌన్ అన్నారు. అయితే, అతను ఎవరు, ఎక్కడినుంచి వచ్చాడు, నేపథ్యం ఏంటి.. ఎవరితో సన్నిహితంగా ఉంటాడు, ఎందుకు హత్యలు చేశాడు అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు. అతను చంపిన ఇద్దరిలో ఎవరు అతనికి పరిచితులో తెలియదని, ఈ హత్యలు అతను కేవలం కావాలని రాండమ్ గా చేశాడని అనుమానిస్తున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఉండే కార్తీక్ తండ్రి జితేష్ వాసుదేవ్ మాట్లాడుతూ నిందితుడిని అరెస్టు చేసినట్లు కెనడియన్ పోలీసు అధికారులు తనకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్టు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరిందని, అయితే ఘటనకు గల కారణాలేమిటో తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
"అతను మరొక హత్య చేశాడని మాకు తెలిసింది. అతని నివాసం నుండి మందుగుండు సామగ్రితో పాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది సాధారణ సంఘటన కాదు, సాధారణ వ్యక్తి ఇద్దరు వేర్వేరు వ్యక్తులను కాల్చిచంపడం మామూలు విషయం కాదు” అని వాసుదేవ్ అన్నారు.
మృతదేహం శనివారం ఘజియాబాద్‌కు చేరుకుంటుందని కెనడా అధికారులు సమాచారం అందించారు. వచ్చిన వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తాం. దీనిమీద చట్టపరమైన చర్యలను ఫాలోఅప్ చేయడానికి, హంతకుడు చిన్న శిక్షతో తప్పించుకోకుండా చూసుకోవడానికి మేం కెనడాకు వెళ్తాం ”అని ఆయన తెలిపారు.
టోరంటోలోని పాఠశాలలో చేరేందుకు కార్తీక్ గత మూడేళ్లుగా కష్టపడి చదువుకున్నాడని ఆయన చెప్పారు.ముఖ్యంగా కార్తీక్ కెనడాలోని భద్రత, అవకాశాల పట్ల ఆకర్షితుడయ్యే చదువుకోసం అక్కడికి వెళ్లాడని అతని తండ్రి చెప్పాడు. అంతేకాదు ఈ మధ్యే అక్కడ అతనికి స్నేహితులు అయ్యారని, రెండు వారాల క్రితమే మెక్సికన్ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ జాబ్ దొరికిందని తెలిపారు. తమ కొడుకుతో తను, తన భార్య చివరిసారిగా గురువారం మధ్యాహ్నం మాట్లాడామని చెప్పుకొచ్చారు.
ఈ హత్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. "ఈ విషాద సంఘటనతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. "టొరంటోలో కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మరణించించడం దిగ్భ్రాంతి కలిగించింది..." అని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు."కార్తీక్ కుటుంబంతో టచ్ లో ఉన్నాం. మృత దేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించడంలో సాధ్యమైన అన్ని రకాల సహాయాలు అందిస్తున్నాం" అని తెలిపారు.