దుబాయ్‌లో భారతీయ దంపతుల దారుణహత్య: హంతకుడు పాకిస్తానీ

Siva Kodati |  
Published : Jun 23, 2020, 05:27 PM IST
దుబాయ్‌లో భారతీయ దంపతుల దారుణహత్య: హంతకుడు పాకిస్తానీ

సారాంశం

దుబాయ్‌లో దారుణం జరిగింది. డబ్బు, నగదు కోసం భారతీయ దంపతులను ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మనదేశానికి హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండేళ్లుగా దుబాయ్‌లోని అరేబియన్ రాంచెస్‌లో నివాసం ఉంటున్నాడు

దుబాయ్‌లో దారుణం జరిగింది. డబ్బు, నగదు కోసం భారతీయ దంపతులను ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మనదేశానికి హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండేళ్లుగా దుబాయ్‌లోని అరేబియన్ రాంచెస్‌లో నివాసం ఉంటున్నాడు.

జూన్ 18న హిరెన్ తన భార్య విధి అధియాతో కలిసి వ్యాపార నిమిత్తం యూఏఈకి వచ్చాడు. వారి వద్ద నగలు, నగదును గమనించిన పాకిస్తాన్‌ సంతతికి చెందిన వ్యక్తి దంపతులిద్దరిని హతమార్చి సొమ్మును దోచుకుని పారిపోయాడు.

స్థానికుల సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. హిరెన్ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో సమాచారం అందించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..