ప్రపంచంలోనే అత్యంత తెలివిగల విద్యార్థిల్లో ఒకరు.. ఈ భారతీయ సంతతి చిన్నారి..

By AN Telugu  |  First Published Aug 3, 2021, 10:34 AM IST

 SAT, ACT ప్రామాణిక పరీక్షలలో ఆ 11యేళ్ల  భారతీయ-అమెరికన్ అమ్మాయి నటాషా పెరి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. దీంతో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్ధులలో నటాషా ఒకరిగా అమెరికా యూనివర్సిటీ గుర్తించింది.


వాషింగ్టన్ : పదకొండేళ్ల ఓ భారత సంతతి చిన్నారి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా రికార్డ్ సాధించింది. అమెరికాలోని టాప్ యూనివర్సిటీ ఆమను ఏ మేరకు గుర్తింపునిచ్చింది.

 SAT, ACT ప్రామాణిక పరీక్షలలో ఆ 11యేళ్ల  భారతీయ-అమెరికన్ అమ్మాయి నటాషా పెరి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. దీంతో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్ధులలో నటాషా ఒకరిగా అమెరికా యూనివర్సిటీ గుర్తించింది.

Latest Videos

undefined

స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్ (SAT), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ACT) అనేవి రెండూ ప్రామాణిక పరీక్షలు, అనేక కాలేజీలు తమ కళాశాలలో అడ్మిషన్ ఇవ్వడానికి వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను ఇవ్వడానికి కూడా ఈ రెండు పరీక్షల ప్రామాణికతల ఆధారంగానే అనేక కంపెనీలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ముందుకు వస్తాయి. 

అందుకే అన్ని కళాశాలలు విద్యార్థులు SAT లేదా ACT పరీక్ష రాసి, వాటి స్కోర్‌లను వారి భావి విశ్వవిద్యాలయాలకు సమర్పించాలి. ఇందులో భాగంగా 
జాన్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్ (CTY) సెర్చ్‌ నిర్వహిస్తుంటుంది. అలా న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్‌మీర్ ఎలిమెంటరీ స్కూల్‌లో  SAT, ACT లేదా ఇలాంటి అసెస్‌మెంట్‌ నిర్వహించింది. ఇందులో నటాషా పెరీ టాప్ గా నిలిచిందని సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

2020-21 టాలెంట్ సెర్చ్ ఇయర్ లో  CTY లో 84 దేశాల నుండి దాదాపు 19,000 మంది విద్యార్థులు అందులో చేరారు. ఈ 19వేలమందిలో నటాషా ఒకరు. CTY ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెరుగైన విద్యార్థులను గుర్తించడానికి ఈ టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆయా విద్యార్థులు చదువు, తెలివి, సామర్థ్యాలను గుర్తిస్తుంది. 

నటాషా గ్రేడ్ 5 లో ఉన్నప్పుడు పెరీ జాన్స్ హాప్‌కిన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్‌ను 2021 స్ప్రింగ్ లో తీసుకుంది, వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాలలో ఆమె గ్రేడ్ 8 కు సమానమైన 90శాతం ఫలితాలు సాధించింది.

ఆమె జాన్స్ హాప్‌కిన్స్ CTY "హై ఆనర్స్ అవార్డ్స్" ను కొట్టేసింది. దీనిమీద పెరి సంతోషపడుతూ..  "ఇది నాకు మరింత స్పూర్తినిస్తోంది’’ అని పెరీ చెప్పుకొచ్చింది. డూడ్లింగ్, జె ఆర్ ఆర్ టోల్కీన్ నవలలు చదవడం ఆమెకు సహాయపడొ ఉండొచ్చు.

జాన్స్ హాప్కిన్స్ పాలసీలో భాగంగా, గ్రాన్యులర్ సమాచారం, వయస్సు లేదా జాతి ప్రకారం విభజించబడదు. అదేవిధంగా, ప్రాడిజీ పేరును వెల్లడించాలా, లేదా అనేది గార్డియన్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ టెస్ట్ కోసం యుఎస్‌లో, మొత్తం 50 రాష్ట్రాల నుండి అవార్డు గ్రహీతలు వస్తారు.

CTY టాలెంట్ సెర్చ్ పాల్గొన్నవారిలో 20 శాతం కంటే తక్కువ మంది CTY హై ఆనర్స్ అవార్డులకు అర్హత సాధించారు. అవార్డు గ్రహీతలు CTY ఆన్‌లైన్, సమ్మర్ ప్రోగ్రామ్‌లకు అర్హత సాధించారు, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర చురుకైన విద్యార్థులతో కలిసి 
అభ్యాసకుల సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు.

"ఈ విద్యార్థుల విజయం మాకు చాలా సంతోషాన్నించింది. గడిచిన సంవత్సరం అతి సాధారణంగా గడిచిపోయినా చదువు మీది వీరి ప్రేమ వెలుగులోకి వచ్చింది’ అని వర్జీనియా రోచ్ , CTYఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒక ప్రకటనలో తెలిపారు.

CTY ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ కోర్సులలో ప్రతి సంవత్సరం 15,500 కంటే ఎక్కువ మంది నమోదవుతుంటారు. వీటితో పాటు బ్రైట్ విద్యార్థుల కోసం  యునైటెడ్ స్టేట్స్, హాంకాంగ్‌లోని సుమారు 20 సైట్లలో CTY ఇన్ పర్సన్ వేసవి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 

click me!