చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో అతి పిన్న వయస్కుడైన బిషప్ మన భారతీయుడే...

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 2:08 PM IST
Highlights

సాజు బాల్యం అంతా కేరళ, బెంగళూరుల్లో గడిచింది. బాల్యంలో బెంగళూరులోని కుష్టు వ్యాధి ఆసుపత్రిలో పెరిగాడు, కారణం అతని తల్లి అక్కడ నర్సుగా పనిచేసేది. సాజు బెంగుళూరులోని సదరన్ ఆసియా బైబిల్ కాలేజీలో విద్యను అభ్యసించాడు. ఆక్స్‌ఫర్డ్‌లోని విక్లిఫ్ హాల్‌లో పరిచర్య కోసం శిక్షణ పొందాడు.

Church of England లో అతి పిన్న వయస్కుడైన Bishopగా నియమితుడైన వ్యక్తి భారతీయుడే కావడం విశేషం. సాజు అనే ఈ ప్రీస్ట్ భారతదేశంలోనే పుట్టారు. Saju అని పిలవబడే ఈ రెవరెండ్ Malayil Lukose Varghese Muthalaly చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో అతి పిన్న వయస్కుడైన బిషప్. అలా 
42 ఏళ్ల సాజు లాఫ్‌బరోకు తరువాతి బిషప్‌గా మారనున్నారు. 

లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో మంగళవారం కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ యూకారిస్ట్ సేవ సందర్భంగా భారతీయ రోజ్‌వుడ్‌తో తయారు చేసిన స్టాఫ్ లేదా క్రోజియర్‌తో ఆయన పవిత్రం చేయబడ్డారు. UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సాజును సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు మేరకు క్వీన్ ఎలిజబెత్ II అతన్ని నియమించారు. "ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ క్షణం కోసం ప్రార్థించడం ఎంత గొప్ప విశేషమో నాకు బాగా తెలుసు. ఈ పిలుపును విస్తృత చర్చి ధృవీకరిస్తున్నట్లు చాలా strong sense ఉంది" అని సాజు పేర్కొన్నట్లు PTI పేర్కొంది.

ఈ వేడుకకు సాజు నలుగురు పిల్లలలో ఇద్దరు హాజరయ్యారు. జిప్, అబ్రహం అనే వీరిద్దరూ సేవ సమయంలో ప్రార్థనల కోసం అతనితో కలిసి ఉన్నారు. 

ఇంతకీ ఈ రెవరెండ్ మలయిల్ లూకోస్ వర్గీస్ ముత్యాలల్లి ఎవరు?
PTIలో వచ్చిన కథనం ప్రకారం, సాజు బాల్యం అంతా కేరళ, బెంగళూరుల్లో గడిచింది. బాల్యంలో బెంగళూరులోని కుష్టు వ్యాధి ఆసుపత్రిలో పెరిగాడు, కారణం అతని తల్లి అక్కడ నర్సుగా పనిచేసేది. సాజు బెంగుళూరులోని సదరన్ ఆసియా బైబిల్ కాలేజీలో విద్యను అభ్యసించాడు. ఆక్స్‌ఫర్డ్‌లోని విక్లిఫ్ హాల్‌లో పరిచర్య కోసం శిక్షణ పొందాడు.

సాజు 21 సంవత్సరాలు ఇంగ్లండ్‌లో గడిపాడు. మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. అతను ప్రస్తుతం రోచెస్టర్ డియోసెస్‌లోని సెయింట్ మార్క్స్, గిల్లింగ్‌హామ్, సెయింట్ మేరీస్ ద్వీపంలో వికార్‌గా పనిచేస్తున్నాడు. 2019లో అతను వికార్ పదవిని స్వీకరించాడు. దీనికంటే ముందు, అతను డియోసెస్‌లో ప్రీస్ట్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశారు. 

గతంలో, సాజు బ్లాక్‌బర్న్ డియోసెస్‌లోని సెయింట్ థామస్, లాంకాస్టర్‌లో తన టైటిల్ సర్వ్ చేశాడు. 2009లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ప్రీస్ట్‌గా నియమితుడయ్యాడు. సెయింట్ థామస్, కెండల్, సెయింట్ క్యాథరిన్స్, క్రూక్‌లో అసోసియేట్ వికార్‌గా నియమించబడ్డాడు. 2011లో కార్లిస్లే డియోసెస్, నార్త్-వెస్ట్ ఇంగ్లాండ్ లలో కూడా పనిచేశారు..

సాజుకు 8-12 సంవత్సరాల మధ్య వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారు. సాజు భార్య పేరు కాటి. లీసెస్టర్‌షైర్‌లోని ఎండర్‌బీలోని బ్రోకింగ్‌టన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అకాడమీలో అతిథులు, డియోసెస్ ప్రతినిధులతో స్వాగత సేవ తర్వాత ఫిబ్రవరి 5న సాజు అధికారికంగా నియమించబడి, బిషప్ ఆఫ్ లౌబరోగా పిలువబడుతారు.
 

click me!