అమెరికా-కెనడా సరిహద్దులో మంచులో కూరుకుపోయి... చనిపోయిన భారతీయ కుటుంబం వివరాలు వెల్లడించిన కెనడా...

By SumaBala Bukka  |  First Published Jan 28, 2022, 11:04 AM IST
గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా అధికారులు మంచులో దొరికిన నాలుగు dead bodyలు జగదీష్ బల్దేవ్‌భాయ్ పటేల్ (39), వైశాలిబెన్ జగదీష్‌కుమార్ పటేల్ (37), విహంగీ జగదీష్‌కుమార్ పటేల్ (11),  ధార్మిక్ జగదీష్‌కుమార్ పటేల్ (3)గా గుర్తించారు. 

జనవరి 19న కెనడా-అమెరికా సరిహద్దుకు సమీపంలోని మానిటోబాలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయి మంచులో కూరుకుపోయి చనిపోయిన నలుగురు Indianల గుర్తింపును canadian అధికారులు ధృవీకరించారు. మృతుల్లో భార్యభర్తలతో సహా ఓ శిశువు, టీనేజర్ ఉండడం విషాదం. ఈ మేరకు Indian High Commission తెలిపింది.

గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా అధికారులు మంచులో దొరికిన నాలుగు dead bodyలు జగదీష్ బల్దేవ్‌భాయ్ పటేల్ (39), వైశాలిబెన్ జగదీష్‌కుమార్ పటేల్ (37), విహంగీ జగదీష్‌కుమార్ పటేల్ (11),  ధార్మిక్ జగదీష్‌కుమార్ పటేల్ (3)గా గుర్తించారు. 

Latest Videos

ఈ మేరకు భారత హైకమీషన్ ఒక ప్రకటన చేస్తూ... “జనవరి 19, 2022న మానిటోబాలోని కెనడా-యుఎస్ సరిహద్దుకు సమీపంలో ఒక శిశువుతో సహా నలుగురు వ్యక్తుల మృతదేహాలు మంచులో కూరుకుపోయి చనిపోయిన స్థితిలో దొరకడం విషాదం. మరణించిన ఈ నలుగురి గుర్తింపులను కెనడియన్ అధికారులు ధృవీకరించారు. నలుగురూ భారతీయులే. ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి మృతి సమాచారాన్ని మృతుల బంధువులకు అందించాం’’ అని తెలిపింది.

భారత్ హైకమిషన్ అధికారులు మరణించిన వారి బంధువులతో టచ్‌లో ఉన్నారు. మృతదేహాలను తీసుకువెళ్లడానికి కావాల్సిన అన్నిరకాల కాన్సులర్ సహాయాన్ని అందజేస్తున్నారు.

కాగా, జనవరి 19న americaలో అక్రమంగా ప్రవేశించే క్రమంలో.. చిన్నారి, టీనేజర్ సహా నలుగురి దుర్మరణం విషాదాన్ని రేపుతోంది. సరిహద్దుకు 40 అడుగుల దూరంలో deadbodyలు పడి ఉండడం బాధాకరంగా మారింది. letters లేకుండా మానవ అక్రమ రవాణా చేస్తూ ఓ పెద్ద ముఠానే పట్టుబడడం షాక్కు గురి చేస్తోంది. రక్తం గడ్డ కట్టుకుపోయే అంతటి చలి.  మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత,  కనుచూపుమేరలో అంతా మంచు మేటలే. దీనికితోడు తీవ్రమైన మంచు తుఫాను. ఆపై చిమ్మచీకటి. 

ఇంతటి భయానక వాతావరణంలో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం ప్రయత్నించింది. వారిలో ఓ చంటి బిడ్డ, టీనేజర్ కూడా ఉన్నారు. ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు పడక.. మంచు తుఫానులో చిక్కుకుని పోయి.. అత్యంత దయనీయ స్థితిలో దుర్మరణం పాలయ్యారు. US-Canada border లో గత బుధవారం ఈ ఘటన జరిగింది. కెనడాలోని  మానిటోబా  ప్రావిన్స్ ఎమర్సన్ బోర్డర్  వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి  ప్రవేశించే ప్రయత్నంలో… తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఆ నలుగురు మరణించారు.  

వీరిలో ఇద్దరిని భార్యాభర్తలుగా..  ఓ చిన్నారి,  టీనేజర్ ను వారి పిల్లలు గా భావిస్తున్నారు. వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ.. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మృతదేహాలు బోర్డర్ కు40 అడుగుల దూరంలో మంచులో  కూరుకుపోయి ఉన్న స్థితిలో దొరికాయి. అంతకుముందు అమెరికా వైపున బార్డర్ లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్ శాండ్ (47) అనే వ్యక్తిని యూఎస్ భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్ లో భారీ మొత్తంలో స్నాక్స్, డిస్పోజబుల్ ప్లేట్లు కప్పులను గుర్తించిన అమెరికా దళాలు..  మరింత మంది బోర్డర్ దాటబోతున్నారని అనుమానించి కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

వెంటనే రంగంలోకి దిగి.. గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి మంచులో కూరుకుపోయిన మృతదేహాలు లభించాయి. గాలింపు చర్యల్లో 15 మంది భారతీయులను గుర్తించి, ప్రశ్నించగా.. మరణించిన నలుగురు వీళ్ళ సమూహం నుంచి విడిపోయిన వాళ్లేనని తేలింది. ఎలాంటి పత్రాలూ లేకుండా అక్రమంగా అమెరికాలో తీసుకెళతానంటూ ఓ వ్యక్తి తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, బోర్డర్ దాటేందుకు ఈ మార్గాన్ని సూచించి.. దాటాక తమను పికప్ చేసుకుంటానని చెప్పాడని వాళ్లు కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఈ కేసులో స్టీవ్ శాండ్ ప్రమేయాన్ని ప్రాథమికంగా గుర్తించిన అమెరికా దళాలు మానవ అక్రమ రవాణా కింద అతడిపై కేసు నమోదు చేశాయి.

గుజరాత్‌కు చెందిన ఈ కుటుంబం చలి తీవ్రతను తట్టుకోలేక మృతి చెందింది. భారత హైకమిషన్, తన ప్రకటనలో, కెనడియన్ అధికారులు ఈ మరణాల మీద దర్యాప్తు చేపట్టారని.. వైద్య పరీక్షల్లో అననుకూల పరిస్థితుల వల్లే వారు మరణించారని తేలిందని తెలిపారు. 

“ఒట్టావాలోని భారత హైకమిషన్, టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ సంఘటనపై అన్ని కోణాల్లో కెనడియన్ అధికారులతో కలిసి పని చేస్తూనే ఉన్నాయి. టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి సీనియర్ కాన్సులర్ అధికారి నేతృత్వంలోని ప్రత్యేక బృందం, కెనడియన్ ఏజెన్సీల ద్వారా కొనసాగుతున్న పరిశోధనలకు సహాయం చేయడానికి, బాధితుల కోసం ఏదైనా కాన్సులర్ సేవలను అందించడానికి మానిటోబాలో క్యాంప్ నిర్వహిస్తోంది ”అని ప్రకటనలో తెలిపింది. 

ఇలాంటి అక్రమవలసలు ఇలా విషాదాంతాలకే దారి తీస్తాయని.. వలసలు సురక్షితంగా, చట్టబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని.. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకూడదని హైకమిషన్ పేర్కొంది.

“భారత్, కెనడా మధ్య అనేక ఆలోచనలు చర్చలో ఉన్నాయి. ఉదాహరణకు, అక్రమ వలసల నిరోధానికి, అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్ లాంటి వాటిని నిరోధించడానికి.. sustainable and circular mobilityని సులభతరం చేయడానికి, భారతదేశం కెనడాకు సమగ్ర మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాన్ని (MMPA) ప్రతిపాదించింది, ఇది కెనడియన్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది" అని కూడా ప్రకటన పేర్కొంది.
 

click me!