హైదరాబాదుకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి అమెరికాలోని జార్జియాలో దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతన్ని కత్తులతో పొడిచి చంపారు. ఆరిఫ్ భార్య ఫాతిమా హైదరాాబాదులోనే ఉంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన వ్యక్తి అమెరికాలో జార్జియాలో దారుణ హత్యకు గురయ్యారు. అతన్ని 37 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ గా గుర్తించారు. దుండగులు కత్తులతో అతన్ని పొడిచి చంపారు. అతనిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.
మొహియుద్దీన్ తన ఇంటి వెలుపలే హత్యకు గురయ్యాడు. తాము అమెరికా వెళ్లి అంత్యక్రియలు చేయడానికి సహాయం చేయాలని ఆరిఫ్ మొహియుద్దీన్ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆరిఫ్ భార్య మెహనాజ్ ఫాతిమా హైదరాబాదులోనే ఉంటోంది.
undefined
ఎమర్జీన్సీ వీసాపై అమెరికా వెళ్లడానికి తనకు, తన తండ్రికి ఏర్పాట్లు చేయాలని ఫాతిమా కోరారు. తాము అమెరికా వెళ్లి తన భర్త అంత్యక్రియలు చేయడానికి అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తాను మాట్లాడానని, గంటన్నర తర్వాత మాట్లాడుతానని ఆరిఫ్ తనతో చెప్పాడని, అయితే ఆ తర్వాత తనకు అతని నుంచి ఫోన్ రాలేదని ఫాతిమా చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను చంపారని ఆ తర్వాత తనకు, తన వదినకు తెలిసిందని ఫాతిమా చెప్పారు.
ఆరిఫ్ మృతదేహం జార్జియాలోని ఆస్పత్రిలో ఉందని, అక్కడ కుటుంబ సభ్యుులు ఎవరూ లేరని చెప్పారు. కుటుంబ తరఫున మజ్లీస్ బచావో తెహరీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు, అమెరికాలోని భారత ఎంబసీకి లేఖ రాశారు.
పలువురు వ్యక్తులు ఆరిఫ్ మీద దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. దాడి చేసినవారిలో స్టోర్ ఉద్యోగి కూడా ఉన్నాడు.