నడి సంద్రంలో భారత నేవి అధికారి.. రక్షించిన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా

By sivanagaprasad kodati  |  First Published Sep 24, 2018, 5:37 PM IST

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయిన భారత నౌకాదళ అధికారి అభిలాష్ టోమీని సహాయక సిబ్బంది రక్షించారు.


ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయిన భారత నౌకాదళ అధికారి అభిలాష్ టోమీని సహాయక సిబ్బంది రక్షించారు. గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి ఎస్. వి. థురియ అనే నౌకలో అభిలాష్ హిందూ మహా సముద్రంలో బయలు దేరారు..

ఈ సమయంలో తుఫాన్లు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన నౌక ప్రమాదానికి గురైంది. పెర్త్‌కు సుమారు 1900 నాటికల్ మైళ్ల దూరంలో తాను చిక్కుకున్నానని.. ఆరోగ్యం ఏమాత్రం బాలేదని అభిలాష్ ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం అందించారు.

Latest Videos

దీంతో ఆయనను రక్షించేందుకు రంగంలోకి దిగిన నౌకా దళం ఐఎన్ఎస్ సాత్పూరాను పంపింది. మరోవైపు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు చెందిన నౌకలు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మూడు రోజుల తర్వాత అభిలాష్‌ను సురక్షితంగా రక్షించగలిగారు. పోటీలో భాగంగా 84 రోజుల్లో ఆయన 10,500 నాటికల్ మైళ్లకు పైగా టోమీ ప్రయాణించి.. మూడో స్థానంలో ఉన్నారు.

click me!