అమెరికాలోని అరిజోనా సరస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. గుంటూరుకు చెందిన భార్యభర్తలతో పాటు, మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు.
వాషింగ్టన్ : అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ సరస్సులో పడి చనిపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటన సోమవారం జరిగింది. అక్కడి అరిజోనా సరస్సు లో జరిగిన ఈ ప్రమాదంలో ఓ భార్యాభర్తలు గల్లంతయ్యారు. వారితో పాటు మరో తెలుగు వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యభర్తల్లోని హరితను మరణించినట్లు గుర్తించారు. ఆమె భర్త నారాయణ (49) మాత్రం దొరకలేదు. ఆ తర్వాత అతనితో పాటు గల్లంతైన మడిశెట్టి గోకుల్ అనే వ్యక్తి కూడా మరణించినట్లు అక్కడి అధికారులు తెలియజేశారు.
హరిత- నారాయణ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా సోమవారం నాడు వీరు అక్కడి ఓ సరస్సు దగ్గరికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయారు. వీరిది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు. దీంతో ఈ దంపతుల మృతదేహాలను అమెరికా నుంచి గుంటూరుకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మూడు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది.
undefined
అమెరికాలో విషాదం : విహారయాత్రకెళ్లి తెలుగు దంపతుల గల్లంతు, భార్య మృతి.. భర్త కోసం సెర్చ్ ఆపరేషన్
మీరి మృతి విషయం తెలిసి.. మృతుల తల్లిదండ్రులు, బంధువుల శోకాలు మిన్నంటాయి. వారి తల్లిదండ్రులు శ్రీరాములు, విష్ణు కుమారి రోధనను, కూతురు దూరమైన వేదనను ఆపలేకపోతున్నారు. వారి రోదనలు హృదయ విదారకంగా ఉన్నాయి. తమ కూతురిని ఎంతో కష్టపడి చదివించామని ఏడుస్తూ చెప్పుకొచ్చారు. డిసెంబర్ 28 బుధవారంనాడు ఆమె పుట్టిన రోజని…రెండు రోజుల ముందే ఆమెకు నూరేళ్లు నిండాయని కన్నీటి పర్యంతం అవుతూ తెలిపారు.
హరిత చదువులో చాలా చురుగ్గా ఉండేదని పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చదివిందని.. హైదరాబాదులోని ఓ కాలేజీలో రెండు సంవత్సరాలు లెక్చరర్గా పని చేసిందని ఆ తర్వాత అమెరికాకు వెళ్లిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మరణించిన హరిత భర్త నారాయణ తండ్రి వెంకట సుబ్బారావు ను సినీ నటుడు నందమూరి తారకరత్న పరామర్శించారు. బుధవారం ఆయనకు ఫోన్ చేసిన తారకరత్న ధైర్యంగా ఉండాలని.. ‘నన్ను మీ పెద్దకొడుకుగా భావించాలని’ వారికి తాను అండగా ఉంటానని చెప్పారు.