అమెరికాలో అగ్నిప్రమాదం.. తెలుగు విద్యార్థులకు తప్పిన ప్రమాదం

By telugu news teamFirst Published Aug 25, 2020, 8:30 AM IST
Highlights

వీరంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి. 

అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్ బర్గ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం గమనార్హం. ఈ ప్రమాదం రెండు రోజుల క్రితమే జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 80 ఫ్లాట్స్ కాలిబూడిదయ్యాయి.

జార్జియా స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి. అట్లాంటాలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు ప్రభుత్వానికి అగ్నిప్రమాద సమాచారం అందించారు.

ఈ ఘటన గురించి తెలియగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర.. బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీవిద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. 

click me!