21మిలియన్ డాలర్ల హెచ్1 బీ వీసా మోసం.. భారతీయుడు అరెస్ట్

By telugu news team  |  First Published Aug 22, 2020, 9:37 AM IST

2011 నుంచి 2016 వరకు ఆశిష్ ఇలాంటి మోసాలు చాలనే పాల్పడ్డాని అక్కడి అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఆశిష్ దాదాపు  21 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించాడని అక్కడి అధికారులు తెలిపారు.


ఎంతో మంది భారతీయులు విదేశాలలో స్థిరపడి ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటూ భారత్ పరువు నిలబెడుతుంటే మరి కొంతమంది పక్క దార్లు తొక్కి భారత్ పరువు తీస్తున్నారు. తాజాగా..హెచ్ 1బీ వీసా మోసాలకు పాల్పడుతున్న ఓ భారత సంతతి వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 

భారత్ కి చెందిన ఆశిష్ సాహ్నీ(48) హెచ్ 1 బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ వీసాల విషయంలో మోసాలకు పాల్పడ్డాడు. 2011 నుంచి 2016 వరకు ఆశిష్ ఇలాంటి మోసాలు చాలనే పాల్పడ్డాని అక్కడి అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఆశిష్ దాదాపు  21 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించాడని అక్కడి అధికారులు తెలిపారు. అతనిని ఇటీవల  కోర్టులో ప్రవేశపెట్టారు... అతను చేసిన నేరం కనుక రుజువైతే.. అతినికి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రాజిక్యూటర్లు తెలిపారు. 

Latest Videos

ఆశిష్ సాహ్నీ తప్పుడు స్టేట్మెంట్లతో కూడిన దరఖాస్తులు సమర్పించి.. శాశ్వతంగా యూఎస్ పౌరుడిగా ఉండేందుకు కూడా ప్రయత్నించాడని వారు ఆరోపించారు. 

click me!