అమెరికాలో చైనా, పాక్ ఎంబసీల ముందు భారతీయుల ధర్నా

By Siva Kodati  |  First Published Feb 23, 2019, 4:27 PM IST

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు...పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలు కట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు...పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలు కట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయులు సైతం ఆందోళన నిర్వహించారు. వందలాది మంది భారతీయులు న్యూయార్క్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి వచ్చి పుల్వామా దాడికి నిరసన తెలిపారు.

Latest Videos

undefined

పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు చైనా మద్ధతు పలకడంపై ఎన్ఆర్ఐలు మండిపడుతున్నారు.

చికాగోలోని చైనా ఎంబసీ ముందు ఆందోళన నిర్వహించిన అమెరికన్ ఇండియన్లు... మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భద్రతా  మండలిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటోందని ఆరోపించారు. 

click me!