చైనా యువకుడికి సాయం.. దుబాయిలో భారతీయుడిపై ప్రశంసలు

By telugu news teamFirst Published Apr 12, 2021, 1:49 PM IST
Highlights

ఇటీవల ఓ వ్యక్తి తాను పోయిందనకున్న డబ్బు తిరిగి దక్కించుకున్నాడు. అందుకు ఓ భారతీయుడు సహాయం చేశాడు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా... ఆ భారతీయుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రస్తుత రోజుల్లో పోయిన వస్తువు దొరకడం కష్టమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా డబ్బులు పొగొట్టుకుంటే మాత్రం తిరిగి దొరకడం చాలా కష్టం. అయితే.. విలువైన వస్తువు పొగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అది వారి దగ్గరకు చేరితో.. లభించే సంతోషాన్ని కూడా లెక్కగట్టలేం. ఇటీవల ఓ వ్యక్తి తాను పోయిందనకున్న డబ్బు తిరిగి దక్కించుకున్నాడు. అందుకు ఓ భారతీయుడు సహాయం చేశాడు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా... ఆ భారతీయుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిహార్‌కు చెందిన సాజిద్ ఆలం దుబాయిలోని  సూపర్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆ సూపర్ మార్కెట్‌ను సందర్శించిన ఓ చైన యువకుడు సూపర్ మార్కెట్ ప్రాంగణంలో దాదాపు రూ.6లక్షల విలువైన డబ్బు, విలువైన కాగితాలు గల బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లిపోయాడు. 

ఆ బ్యాగ్‌ను గుర్తించిన సాజిద్ ఆలం.. తన పైఅధికారుల సహాయంతో దాన్ని భద్రపరిచాడు. అంతేకాకుండా బ్యాగ్ కోసం తిరిగొచ్చిన సదరు చైనా యువకుడికి దాన్ని అందించాడు. ఈ క్రమంలో.. విషయాన్ని వివరిస్తూ సాజిద్ ఆలం పైఅధికారులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. సాజిద్ ఆలంపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. 

click me!