అమెరికాలో ఇండియన్ టెక్కీ దంపతుల మృతి.. బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి

By telugu news team  |  First Published Apr 9, 2021, 12:08 PM IST

దంపతుల శరీరంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయని.. ఇద్దరి శరీరాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయని అక్కడి మీడియా వర్గాలు వివరించాయి.


భారత్ కి చెందిన ఓ ఇండియన్ టెక్కీ.. అమెరికాలో  ప్రాణాలు కోల్పోయాడు.. అతనితోపాటు.. అతని భార్య కూడా చనిపోవడం గమనార్హం. కాగా... వారి నాలుగేళ్ల చిన్నారి మాత్రం.. బాల్కనీలో ఒక్కతే కూర్చొని ఏడుస్తుండగా.. స్థానికులు గమనించారు. దీంతో.. వీరి విషయం వెలుగులోకి వచ్చింది.

దంపతుల శరీరంపై తీవ్రంగా గాయాలు ఉన్నాయని.. ఇద్దరి శరీరాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయని అక్కడి మీడియా వర్గాలు వివరించాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Latest Videos

భారత్ కి చెందిన బాలాజీ భరత్ రుద్రవర్(32) కి భార్య ఆరతీ బాలాజీ రుద్రవర్(30) నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా.. వీరు న్యూజెర్సీలోని నార్త్ అర్లింగ్టన్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. బాలాజీ స్వస్థలం మహారాష్ట్ర. కాగా.. వీరికి 2014లో వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు అమెరికాలో స్థిరపడ్డారు. 2017లో వీరికి కుమార్తె జన్మించింది.

అనూహ్యంగా.. వీరు వాళ్లు ఉండే అపార్ట్ మెంట్ లోనే శవాలై కనిపించారు. దంపతులిద్దరూ గొడవ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని చనిపోయారా.. లేదా.. ఎవరైనా హత్య చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. ఇంట్లో పెద్ద గొడవ జరిగినట్లుగా కనపడుతోందని అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!