అమెరికాలో 10 రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చివరకు..

By Sumanth KanukulaFirst Published Apr 20, 2023, 8:28 PM IST
Highlights

అమెరికాలో అదృశ్యమైన 30 ఏళ్ల భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వాషింగ్టన్: అమెరికాలో అదృశ్యమైన 30 ఏళ్ల భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. జర్మన్ పట్టణానికి చెందిన అంకిత్ బగై ఏప్రిల్ 9వ తేదీన అదృశ్యమయ్యాడు. అంకిత్ చివరిసారిగా ఏప్రిల్ 9 న ఉదయం 11.30 గంటలకు మైల్‌స్టోన్ ప్లాజా సమీపంలోని చికిత్సా కేంద్రం నుండి బయలుదేరినప్పుడు కనిపించాడు. అప్పటి నుంచి అంకిత్ జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 

అతని కోసం గాలింపు చేపట్టింది. అతడను ర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీలో ఉండి ఉంటాడని నమ్మింది. అయితే అంకిత్ ఆచూకీ  కోసం తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులు లాభం లేకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అంకిత్ ఆచూకీ కోసం అతడు చివరిసారిగా కనిపించిన చోటుకు సమీప ప్రాంతాల్లో ఎంతో ఆశతో అతని కుటుంబం వెతుకులాట కొనసాగించారు. అంకిత్ ఆచూకీ తెలిపిన వారికి 5 వేల డాలర్ల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.

అయితే మంగళవారం చర్చిల్ సరస్సులో మృతదేహాం కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానిని వెలికితీశారు. ఆ మృతదేహాం అంకిత్‌‌దేనని గుర్తించినట్టుగా మాంట్‌గోమెరీ పోలీసు ప్రకటనలో తెలిపారు.

 అంకిత్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వర్జీనియా విశ్వవిద్యాలయం నుంచి అతడు గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అంకిత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. దానిని ఎదుర్కొనేందుకు నిత్యం మందులను వాడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అయితే అంకిత్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఫౌల్ ప్లే ఉందని పోలీసులు అనుమానించడం అక్కడి మీడియా పేర్కొంది. 

click me!