బర్త్ డే గిఫ్ట్.. లవర్ ని పోలీసులకు పట్టించిన యువతి

By ramya neerukondaFirst Published 30, Aug 2018, 1:50 PM IST
Highlights

ఓ యువకుడికి తన లవర్ నుంచి ఊహించని గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అందుకున్న లవర్ కి దిమ్మతిరిగిపోయింది.

పుట్టిన రోజు సందర్భంగా.. ఓ యువకుడికి తన లవర్ నుంచి ఊహించని గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అందుకున్న లవర్ కి దిమ్మతిరిగిపోయింది.  ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసా.. దగ్గరుండి మరీ లవర్ ని పోలీసులకు పట్టించింది.జూన్ 18న జరిగిన ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే..
 
కమల్‌జిత్ సాగూ అనే 44 ఏళ్ల వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా  స్నేహితురాలిని తీసుకుని బయటికి వెళ్లాడు. తిరిగి లాంగ్‌బెంటన్‌లోని తన నివాసానికి వస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాగి వాహనం నడపవద్దని ఆమె చెప్పినా వినిపించుకోకుండా అతడు డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇంతలో సిగరెట్ల కోసం అతడు ఓ చోట కారు ఆపడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పేసింది.
 
యూకే నిబంధనల ప్రకారం 35 మైక్రోగ్రాముల అల్కహాల్ వరకు పరిమితి ఉండగా... శ్వాస పరీక్షలో 61 ఎంజీలుగా తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనికితోడు అతడు ఇన్సూరెన్స్ లేకుండానే డ్రైవ్ చేస్తున్నట్టు తేలింది. దీంతో ప్లాస్టరర్‌గా పనిచేస్తున్న సాగూకి కోర్టు 583 పౌండ్ల జరిమానా విధించింది. కోర్టు ఖర్చుల కింద మరో 85 పౌండ్లు, బాధితుల సర్‌చార్జి కింద 58 పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది. కాగా ఈ ఘటనతో సాగూ, అతడి ప్రియురాలి మధ్య రిలేషన్‌కి  ఫుల్ స్టాప్ పడిందనీ...అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయకపోయి ఉంటే అతడి పుట్టిన రోజు విషాదంగా ముగిసేదని అతడి లాయర్ పేర్కొనడం కొసమెరుపు.

Last Updated 9, Sep 2018, 11:24 AM IST