ట్రంప్ మనసు కరిగింది: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త

By Siva Kodati  |  First Published May 16, 2019, 3:50 PM IST

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ వచ్చిన తర్వాత ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ విధానంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం కలలు కంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. 


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ వచ్చిన తర్వాత ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ విధానంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం కలలు కంటున్నవారు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో కొత్తగా తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ విధానం ఆనందాన్ని కలిగించింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు... ఇమ్మిగ్రేషన్ విధానంలో అగ్ర రాజ్యాధినేత సరికొత్త మార్పులను ప్రతిపాదించారు.

Latest Videos

undefined

కుటుంబ సంబంధాల ఆధారంగా కాకుండా.. నైపుణ్యం ఆధారంగా గ్రీన్ కార్డ్ జారీలో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 66 శాతం కుటుంబ సంబంధాలు ద్వారా 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.

ట్రంప్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డ్ అభ్యర్ధులను ఎంపిక చేయనుంది. అమెరికా ప్రతీ ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా, హెచ్‌ 1 బీ వీసా పొంది దశాబ్ధ కాలంగా గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ నిర్ణయం మేలు కలిగించనుంది. 

click me!