రెండు ట్రైనీ విమానాలు ఢీ.. భారతీయ యువతి సహా ముగ్గురు మృతి

First Published 18, Jul 2018, 2:53 PM IST
Highlights

మియామి సమీపంలో శిక్షణకు ఉపయోగించే రెండు చిన్న విమానాలు అనుకోకుండా ఒకదానిని మరొకటి ఢొకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

రెండు ట్రైనీ విమానాలు ఢీకొని ఒక భారతీయ యువతి సహా.. ముగ్గురు మృతి చెందిన సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. మియామి సమీపంలో శిక్షణకు ఉపయోగించే రెండు చిన్న విమానాలు అనుకోకుండా ఒకదానిని మరొకటి ఢొకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ రెండు విమానాలు మియామిలోని డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూలుకి చెందినవిగా గుర్తించారు. ఈ స్కూల్ కి చెందిన విమానాలు కేవలం 10ఏళ్లలో రెండు డజన్లకు పైగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

మృతులు నిషా సెజ్వాల్(19 సంవత్సరాలు, ఇండియా), జార్గే షాంచెజ్(22), రాల్ఫ్ నైట్(72) గా గుర్తించారు.  నిషా.. 2017లో ఈ ఫ్లైట్ స్కూల్ లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆమె ఫేస్ బుక్ ఆధారంగా ఈ విషయాలు తెలుసుకున్నట్లు వారు తెలిపారు.  

Last Updated 18, Jul 2018, 2:53 PM IST