ప్రధాని పదవి రేసులో చంద్రబాబు: శరద్ పవార్ మాట ఇదీ..

By telugu teamFirst Published Apr 27, 2019, 1:41 PM IST
Highlights

ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కన్నా తృణమూల్ కాంగ్రెసు చీఫ్ మమతా బెనర్జీ, టీడీపి నేత చంద్రబాబు నాయుడు, బిఎస్పీ నేత మాయావతి మంచి అభ్యర్థులని పవార్ అన్నారు. జీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు 

ముంబై: ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెసు చీఫ్ రాహుల్ గాంధీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యతిరేకించారు. ప్రస్తుతం లోకసభ ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆయన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పేరు కూడా ఉంది.

ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కన్నా తృణమూల్ కాంగ్రెసు చీఫ్ మమతా బెనర్జీ, టీడీపి నేత చంద్రబాబు నాయుడు, బిఎస్పీ నేత మాయావతి మంచి అభ్యర్థులని పవార్ అన్నారు. జీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు 

నాన్ ఎన్డీఎ మహా కూటమి ఉందా అనే ప్రశ్నకు జవాబును దాటేస్తూ రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అనే మాటలు నిరాధారమైనవని అన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆసక్తి ఉన్నట్లు మాయావతి ఇప్పటికే వెల్లడించారు. మమత, చంద్రబాబు మాత్రం బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. 

తాను ప్రధాని పదవి రేసులో లేనని పవార్ చెప్పారు. అయితే, ప్రతిపక్షాల ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆయన కింగ్ మేకర్ గా మారవచ్చు. ఎన్నికల తర్వాత కొన్ని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా తమ వైపు వస్తాయని పవార్ అన్నారు. 

దేశంలో మంచి నాయకుల కొరత ఏమీ లేదని, ఫలితాలు వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఇప్పుడే ఏదో ఒక పేరు చెప్పడం సరైంది కాదని అన్నారు. ప్రతి ఒక్కరి సాయంతో తాము మెజారిటీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు . 

click me!