ఏప్రిల్ 23న మార్కెట్లోకి జియోమీ కొత్త టీవీ మోడళ్లు

By rajashekhar garrepally  |  First Published Apr 17, 2019, 11:27 AM IST

చైనా మొబైల్ తయారీ దిగ్గజం జియోమీ ఇప్పుడు టెలివిజన్(టీవీల) మార్కెట్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే జియోమీ ఏప్రిల్ నెలలో సరికొత్త టీవీలను ప్రవేశపెడుతోంది.


బీజింగ్/న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దిగ్గజం జియోమీ ఇప్పుడు టెలివిజన్(టీవీల) మార్కెట్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే జియోమీ ఏప్రిల్ నెలలో సరికొత్త టీవీలను ప్రవేశపెడుతోంది.

Xiaomi సంస్థ టీవీ జనరల్ మేనేజర్ లీ జియోషౌంగ్ తమ సంస్థ టీవీ ఉత్పత్తులు ఏప్రిల్ చివరి వారంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే వెల్లడించారు. తాజాగా, కొత్త టీవీల విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

Latest Videos

undefined

జియోమీ టీవీలు ఏప్రిల్ 23, 2019 నుంచి మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది జియోమీ.  సన్నగా బెజల్లు కలిగి చూడటానికి ఆకర్షణీయంగా ఈ టీవీలు ఉన్నాయి. 

ఈ కంపెనీ టీవీ విభాగంలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హైలెట్. ఆండ్రాయిడ్ కస్టమ్ వర్షన్‌లో ఈ టీవీలు పనిచేస్తాయి. వినియోగదారులకు అవసరమైన, ఆసక్తి కలిగి కంటెంట్ కూడా సిఫార్సు చేస్తుంది. ప్యాచ్ వాల్ ఉపయోగించి సినిమాలు, సీరియళ్లు, సంగీతానికి యూజర్లు త్వరగా యాక్సెస్ పొందవచ్చు.

జియోమీ టీవీ కొత్త మోడళ్లను ఏప్రిల్ 23న చైనాలో ప్రవేశపెడుతోంది. అయితే, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ టీవీ మోడళ్లపై స్పష్టత రాలేదు. కాగా, చైనాలో విడుదలైన వెంటనే భారతదేశ మార్కెట్లోకి కూడా ఈ టీవీ మోడళ్ళు ప్రవేశించనున్నాయి. కాగా, జియోమీ టీవీలు భారతదేశ మార్కెట్లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతుండటం గమనార్హం.

click me!