ఇక వాట్సాప్‌లో ‘స్టేటస్‌’ ప్రకటనలు చూసుకోవచ్చు

By Siva KodatiFirst Published May 26, 2019, 11:15 AM IST
Highlights

సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ అనుబంధ ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం ‘వాట్సాప్‌’ స్టేటస్‌లో ప్రకటనలను అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకురానున్నామని ప్రకటించింది. 
 

సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ అనుబంధ ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం ‘వాట్సాప్‌’ స్టేటస్‌లో ప్రకటనలను అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకురానున్నామని ప్రకటించింది. 

ఈ వారం నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్‌ సదస్సుకు హాజరైన ఆలివర్‌ పొంటోవిల్లే ట్విటర్‌ ద్వారా ఈ సంగతి వెల్లడించారు. వాట్సాప్‌లో వినియోగించే ఆండ్రాయిడ్‌ 2.18.305 బీటా  వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగదశలో ఉంది.

ఈ యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. గతేడాది అక్టోబర్‌లోనే వాట్సాప్‌ ప్రకటనలపై వార్తలు మార్కెట్‌ వర్గాల్లో హల్‌ చల్‌ చేశాయి.

అయితే వాట్సాప్‌ ఈ వార్తలను తాజాగా ధృవీకరించింది. స్టేటస్‌లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్‌ ద్వారా స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువ కావడానికి ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సాప్‌ ప్రతినిధి తెలియజేశారు.

వాట్సాప్‌లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా భారీ ఆదాయం ఆర్జించాలని యోచిస్తోంది. 

స్టేటస్ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సాప్‌ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 150 కోట్ల మందికి చేరుకుంది.  భారత్‌లో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 250 మిలియన్లు.

click me!
Last Updated May 26, 2019, 11:15 AM IST
click me!