రిటైల్ ఆఫ్‌లైన్ పైనే వివో లక్ష్యం.. అంబాసిడర్‌గా సారా అలీఖాన్‌

By narsimha lodeFirst Published Jul 22, 2019, 12:28 PM IST
Highlights

గట్టి పోటీ ఉన్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజాలైన శామ్‌సంగ్‌, షియోమీ సంస్థలతో పోటీ పడేందుకు చైనాకు చెందిన వివో ‘ఎస్‌’ సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 

న్యూఢిల్లీ: గట్టి పోటీ ఉన్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజాలైన శామ్‌సంగ్‌, షియోమీ సంస్థలతో పోటీ పడేందుకు చైనాకు చెందిన వివో ‘ఎస్‌’ సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఎస్‌ సిరీస్‌ హ్యాండ్‌సెట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సారా అలీఖాన్‌ను నియమించింది. 

రూ.15 వేల నుంచి రూ.25 వేల ధరల విభాగంలో ఎస్‌ సిరీస్‌ ఫోన్లు నిలపాలని అనుకుంటున్నట్టు వివో ఇండియా డైరెక్టర్‌ బ్రాండ్‌ స్ర్టాటజీ నిపుణ్‌ మార్యా తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్లు ఆఫ్‌లైన్‌లోనే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివో బ్రాండ్ ఫోన్లన్నింటికీ బాలీవుడ్ నటుడు అమీర్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.

‘వీ’ సిరీస్ ఫోన్లు స్టైల్‌గా ఉన్నాయి. సెల్ఫీ (ఫ్రంట్) కెమెరాతోపాటు వెరీ గుడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ‘వీ’ సిరీస్ ఫోన్లు ఇన్నోవేషన్‌తో రూపుదిద్దుకున్నాయి. రీసెర్చ్ ఫర్మ్ ఐడీసీ తెలిపిన వివరాల ప్రకారం గత జనవరి - మార్చి త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 13 శాతం వాటా వివో బ్రాండ్లదే. షియోమీ ఫోన్లకు 30.6 శాతం, శామ్ సంగ్ ఫోన్లకు 22.3 శాతం వాటా కలిగి ఉంది. 

click me!