బీవేర్: ‘ఫేస్‌యాప్‌’ డౌన్‌లోడ్‌ విషయమై తస్మాత్ జాగ్రత్త!!

By Siva KodatiFirst Published Jul 21, 2019, 12:07 PM IST
Highlights

ఫేస్‌బుక్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ హెచ్చరించింది. ‘మొబిడ్యాష్‌’ పేరుతో మొబైల్స్‌లో యాడ్ వేర్ చేరడంతో సమస్య కారణమవుతోంది.

ప్రస్తుతం అంతా ‘ఫేస్’యాప్ అంటే అంతా ఆకర్షిస్తోంది. ఎక్కడ చూసినా విపరీతమైన ట్రెండింగ్‌ యాప్ ఇది‌. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ, న్యూఢిల్లీ నుంచి గల్లీ వరకూ యువత ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తాము వృద్ధులైతే ఎలా ఉంటారో ముందే చూసుకుంటున్నారు. 

ఫేస్ యాప్‌లోని పలు ఫిల్టర్లను ఉపయోగిస్తూ ఆ ఫొటోలను బంధు మిత్రులతో పంచుకుని తెగ మురిసిపోతున్నారు. ఈ ఫొటోను చూసిన మిగతా వారు కూడా వెంటనే ‘ఫేస్‌యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇటువంటి సమయాల్లోనే ఇక్కడ కాసింత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై హెచ్చరిస్తోంది. ఫోట్‌ మార్ఫింగ్‌ యాప్‌ ‘ఫేస్‌యాప్‌’ను పోలిన పలు నకిలీ యాప్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకున్నారో మీ ఫోన్‌లో యాడ్‌వేర్‌, మాల్వేర్‌ ప్రవేశిస్తాయి. 

‘మొబిడ్యాష్‌’ పేరుతో ఇప్పటికే కొన్ని మొబైల్స్‌లో యాడ్‌వేర్‌ ప్రవేశించినట్లు కాస్పర్ స్కై పేర్కొంది. మరోపక్క ఫేస్‌యాప్‌ భద్రత విషయంలోనూ పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ యాప్‌డౌన్‌లోడ్‌ చేసుకుని ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా అవన్నీ రష్యాకు కేంద్రంగా పనిచేసే ఫేస్‌యాప్‌ సర్వర్‌కు అప్‌లోడ్‌ అవుతున్నాయి. 

‘సరైన ఫేస్‌యాప్‌ కాకుండా నకిలీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే వారి మొబైల్‌లో ‘మొబిడ్యాష్‌’ పేరుతో యాడ్‌వేర్‌ వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి ఆ నకిలీయాప్‌ కార్యకలాపాలు పెరిగిపోతాయి. అలా నకిలీయాప్‌ చాప కింద నీరులా చేరి మీతో పాటు, మీ స్నేహితులను ఇబ్బంది పెడుతుంది’ అని  కాస్పర్ స్కై ప్రతినిధి ఇగోర్‌ గోలోవిన్‌ హెచ్చరించారు.

ప్రతి మనిషి ముఖానికి వ్యక్తిగతంగా వారికి మాత్రమే కాపీరైట్‌ ఉంటుందని అలాంటి దాన్ని ఇలా ఫేస్‌యాప్‌లా కనిపించే నకిలీ యాప్‌లలో అప్‌లోడ్‌ చేసి ఇబ్బందులకు గురి కావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 నుంచి ఉన్న ఈ ఫేస్‌యాప్‌ సడెన్‌గా వైరల్‌ కావడం గమనార్హం.

click me!