‘నిర్ణయం తీసుకోండి లేదా టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తాం’

By rajashekhar garrepallyFirst Published Apr 22, 2019, 5:37 PM IST
Highlights

చైనాకు చెందిన వినోదపు యాప్ టిక్‌టాక్‌పై మద్రాసు హైకోర్టు  విధించిన తాత్కాలిక నిషేధంపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఈ యాప్ విషయంలో మద్రాసు హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే టిక్‌టాక్‌‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వినోదపు యాప్ టిక్‌టాక్‌పై మద్రాసు హైకోర్టు  విధించిన తాత్కాలిక నిషేధంపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఈ యాప్ విషయంలో మద్రాసు హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే టిక్‌టాక్‌‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

టిక్‌టాక్‌ యాప్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్.. తమ యాప్‌పై మద్రాసు హైకోర్టు విధించిన నిషేధం ఎత్తివేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని బైట్‌డ్యాన్స్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 

సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా, అశ్లీలతను ప్రోత్సహించేలా కంటెంట్ ఉంటోందని కొందరు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో.. టిక్ టాక్ యాప్‌ డౌన్ లోడ్‌పై ఆ కోర్టు నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

అయితే, సుప్రీంకోర్టు ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బైట్ డ్యాన్స్. ఈ నిషేధం భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని  బైట్ డ్యాన్స్ తన పిటిషన్‌లో పేర్కొంది. 

భారత పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. టిక్ టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. కాగా, ఇప్పటికే టిక్ టాక్‌కు 54 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండటం గమనార్హం. అయితే, నిషేధం నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలగించడం జరిగింది.

click me!