ఫెస్టివ్ సీజనైనా.. ఉత్పత్తి తగ్గించుకున్న మారుతి, టాటా

By Nagaraju penumalaFirst Published Oct 10, 2019, 3:54 PM IST
Highlights

వరుసగా పది నెలలుగా ఆటోమొబైల్ సేల్స్ పడిపోతున్న నేపథ్యంలో పండుగల సీజన్‌లోనూ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మారుతి సుజుకి, టాటా మోటార్స్ సంస్థలు తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి.

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో మందకోడి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌పై గంపెడు ఆశ పెట్టుకున్న సంస్థలకు నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేమి లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి కూడా వరుసగా ఎనిమిది నెల సెప్టెంబర్‌లోనూ తన ఉత్పత్తిని 17.48 శాతం తగ్గించుకున్నది. టాటా మోటార్స్ కూడా కార్ల ఉత్పత్తి తగ్గించుకున్నది.

గత నెలలో సంస్థ కేవలం 1,32,199 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో 1,60,219 కార్లను ప్రొడ్యుస్ చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వీటిలో ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,57,659 యూనిట్ల నుంచి 1,30,264 యూనిట్లకు పడిపోవడంతో కంపెనీ ఉత్పత్తిపై భారీ దెబ్బతీసింది.

మినీ, కాంప్యాక్ట్ సెగ్మెంట్ కాైర్లెన ఆల్టో, న్యూ వ్యాగన్ ఆర్, సెలేరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్‌ల ఉత్పత్తి 1,15,576 ల నుంచి 98,337లకు తగ్గించింది. వీటితోపాటు విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ మోడళ్ల ఉత్పత్తి కూడా 17.05 శాతం తగ్గించుకున్న సంస్థ.. మధ్యస్థాయి సెడాన్ సియాజ్‌ను 2,350 యూనిట్లు ప్రొడ్యుస్ చేయగా, లైట్ కమర్షియల్ వాహనం సూపర్ క్యారీ వాహనాలను కూడా తగ్గించుకున్నది.

మరో సంస్థ టాటా మోటర్స్ కూడా 63 శాతం అంటే 6976 కార్లను ఉత్పత్తిని తగ్గించుకున్నది. గత నెలలో కార్ల విక్రయాలు 20.5 శాతం పతనం అయ్యాయి. మారుతి 27 శాతం, హ్యుండాయ్ 14.8శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 28 శాతం, హోండా సేల్స్ 37 శాతం, ఫోర్డ్ సేల్స్ 32.5 శాతం, నిస్సాన్ సేల్స్ 56 శాతం వరకు పడిపోయాయి.

click me!