భారత విపణిలోకి ‘గెలాక్సీ ఫోల్డ్‌’.. ధర రూ.1.65 లక్షలే.. 4నుంచి ప్రీ బుకింగ్స్

By narsimha lode  |  First Published Oct 2, 2019, 12:57 PM IST

 ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది శామ్ సంగ్


న్యూఢిల్లీ: భారత విపణిలోకి ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ ఫోల్డ్‌’ను తేనున్నట్లు శామ్‌సంగ్‌ ప్రకటించింది. ఫోల్డ్‌బుల్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.1,64,999గా నిర్ణయించింది. భారతదేశ విపణిలో  ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కావటం విశేషం.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని శామ్‌సంగ్‌ ఆగ్నేయాసియా ప్రెసిడెంట్‌, సీఈఓ హెచ్‌సీ హోంగ్‌ అన్నారు. మంగళవారం శామ్‌సంగ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రణ్‌జీవిత్‌ సింగ్‌తో కలిసి ఆయన గెలాక్సీ ఫోల్డ్‌ను ఆవిష్కరించారు.

Latest Videos

undefined

ప్రస్తుతం శామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ దక్షిణ కొరియా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ‘ఫోల్ఢ్‌’ సరికొత్త బెంచ్‌మార్క్‌గా మారనుందని సింగ్‌ అన్నారు. ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు 24 గంటలపాటు సర్వీస్‌తోపాటు వారి సందేహాలకు జవాబు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. 

ఏడాదిపాటు ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి గెలాక్సీ ఫోల్డ్‌ ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయని శామ్‌సంగ్‌ ఆగ్నేయాసియా ప్రెసిడెంట్‌, సీఈఓ హెచ్‌సీ హోంగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 నగరాల్లోని 315 ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐఫోన్‌ 512 జీబీ వేరియంట్‌ 11 ప్రో మాక్స్‌ ధర రూ.1,41,900గా ఉంది.

12 జీబీ రామ్‌ విత్ 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీతో శామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ ఫోన్‌లో 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. కవర్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇంటర్నల్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. బ్యాక్‌లో 16 ఎంపీ, 12 ఎంపీ, 12 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. దీనికి 4380 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. 
 

click me!