ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే.. గూగుల్ ఫస్ట్

By Siva Kodati  |  First Published Jun 23, 2019, 3:27 PM IST

దేశీయంగా డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్ ‘ఫోన్ పే’గత నెలలో 47 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకోవడమే దీనికి కారణం.


భారతీయులు క్రమంగా డిజిటల్ చెల్లింపుల పద్దతులను శరవేగంగా అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్ సంస్థ‘ఫోన్ పే’ గత నెలలో  47 లక్షల డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.

2018తో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసిందని మొబైల్ యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘సెన్సర్ టవర్’ తెలిపింది. 90 లక్షల డౌన్‌లోడ్స్‌తో  గూగుల్‌ పే(తేజ్‌) మొదటి స్థానంలో ఉంది. తర్వాతీ స్థానాల్లో పే పాల్‌, క్యాష్‌ యాప్‌, యూనియన్‌ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్‌ తెలిపారు.

Latest Videos

undefined

ఫోన్‌ పే, గూగుల్‌ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పది కోట్ల డౌన్‌లోడ్‌లు సాధించాయి. కాగా గూగుల్‌ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్‌లోడ్‌లు ఇండియాలోనే జరిగాయి.   

‘ఫోన్ పే’ యాప్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివ్రుద్ధి చేసింది. అయితే గూగుల్ పే సంస్థ ఎన్పీసీఐ ఆధ్వర్యంలోని భీమ్ యాప్ ను వాడుతుంది. ఇది కూడా గూగుల్ ప్లే నుంచి 10 కోట్ల సార్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. 

click me!