పేరుకు రెగ్యులేట్ చేస్తామంటే తీవ్ర పరిణామాలు: సుందర్ పిచాయ్‌

By Siva Kodati  |  First Published Jun 16, 2019, 10:49 AM IST

‘యాంటీ ట్రస్ట్’ పేరిట తమను నియంత్రించడమే లక్ష్యంగా నియంత్రణకు దిగితే తదుపరి పరిణామాలు ఊహకు అందబోవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు.


మమ్మల్ని నియంత్రించడం కోసం నియంత్రణలు విధిస్తే తర్వాత తలెత్తే పరిణామాలు ఊహకు అందవని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ‘యాంటీ ట్రస్ట్’ కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

టెక్‌ దిగ్గజాలను నియంత్రించాలనుకోవడంపై ఆయన హెచ్చరించారు. ఒక ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

undefined

గతంలో కూడా ఇటువంటి దర్యాప్తును ఐరోపా యూనియన్ దేశాల్లో ఎదుర్కొన్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అమెరికాలో తమ సంస్థ పనితీరుపై ఇప్పడేమీ ఆశ్చర్యపోవడం లేదని చెప్పారు. 

యాంటీ ట్రస్ట్‌ నిబంధనల  ఉల్లంఘనకు సంబంధించి గూగుల్‌పై కేసులు పెట్టేందుకు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సిద్ధమవుతోంది. 2010లో షాపింగ్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌కు గూగుల్‌ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని 2010లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో 2017లో గూగుల్‌పై 2.7 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు. 

తమ సంస్థ పై‘యాంటీ ట్రస్ట్’ పేరిట జరిగే స్క్రూటినీ సరైందేనని, తాము కూడా దీనికి సంబంధించి జరిగే దర్యాప్తు, సంప్రదింపుల్లో నిర్మాణాత్మకంగా భాగస్వామ్యం వహిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’మాదిరిగా గూగుల్ సంస్థపై యాంటీ ట్రస్ట్ కంప్లయింట్లు వచ్చాయని వార్తలొచ్చాయి.

click me!