ఫోర్బ్స్ జాబితా టాప్ 3లో ఇన్ఫోసిస్.. టీసీఎస్ కూడా

By Nagaraju penumala  |  First Published Sep 25, 2019, 1:42 PM IST

ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ కంపెనీల్లో.. 17 భారతీయ సంస్థలకు చోటుదక్కింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో ఇన్ఫోసిస్ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. టీసీఎస్, టాటా మోటార్స్ సంస్థలు తొలి 50 స్థానాల్లో ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో పేమెంట్ సాంకేతిక సంస్థ 'వీసా', లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఉన్నాయి.


ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారతీయ సంస్థలకు చోటు దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో.. పేమెంట్ సాంకేతిక సంస్థ 'వీసా', లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఉన్నాయి.

నాలుగో స్థానంలో నెట్ ఫ్లిక్స్, ఐదో ర్యాంకులో పేపాల్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆరవ స్థానంలో, ఏడో స్థానంలో వాల్ట్ డిస్నీ, కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్స్ ఎనిమిదో స్థానం, మాస్టర్ కార్డ్ తొమ్మిదో స్థానం, కాస్ట్ కో హోల్సేల్ సంస్థ 10వ ర్యాంకు పొందాయి.

Latest Videos

undefined

గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో 31వ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్.. ఏకంగా ముడో స్థానానికి ఎగబాకడం గమనార్హం. ఇక మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా 22వ ర్యాంకు పొందింది.

ఫోర్స్బ్ జాబితాలో 250 అత్యుత్తమ కంపెనీల్లో 59 సంస్థలతో అమెరికా తొలి స్థానంలో ఉంది. జపాన్, చైనా, భారత్ మూడు దేశాలకు చెందిన 82 కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. విశ్వసనీయత, సామాజిక ప్రవర్తన, వస్తు-సేవల నాణ్యత ఆధారంగా స్టాటిస్టా అనే సంస్థతో కలిసి ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది.

2000 అంతర్జాతీయ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల పరిస్థితిపై 50కి పైగా దేశాల్లోని 15 వేల మంది అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితా రూపుదిద్దుకున్నది. ఫోర్బ్స్ జాబితా టాప్ - 50లో టీసీఎస్ (22), టాటా మోటార్స్ (31) చోటు దక్కించుకున్నాయి.

ఆ తర్వాత టాటా స్టీల్ (105), లార్సెన్ టూబ్రో (115), మహీంద్రా & మహీంద్రా (117), హెచ్డీఎఫ్సీ (135), బజాజ్ ఫిన్ సర్వ్ (143), పిరమాల్ ఎంటర్ ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (153), హెచ్సీఎల్ (155), హిందాల్కో(157), విప్రో (168), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (204), సన్ ఫార్మా (217), జనరల్ ఇన్సూరెన్స్ (224), ఐటీసీ (231), ఏషియన్ పెయింట్స్ (248) ఉన్నాయి.

click me!