లెనోవో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే అదుర్స్!

By Nagaraju penumalaFirst Published Sep 24, 2019, 11:45 AM IST
Highlights

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా మార్కెట్లోకి కే10 ప్లస్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. ట్రిపుల్ రేర్ కెమెరాలతోపాటు స్నాప్ డ్రాగన్ 632 ఎస్వోసీ తదితర ఫీచర్లను కలిగి ఉంది కే లెనోవో ప్లస్. ఇది బడ్జెట్ ఫోన్ కూడా.

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్ మేజర్ లెనోవో అద్భుతమైన ఫీచర్లతో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. లెనోవో కె10 ప్లస్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌లోని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ, ట్రిపుల్ రియర్ కెమెరా తదితర ఫీచర్లు గల ఈ ఫోన్‌‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 30 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. లెనోవో కె10 ప్లస్ 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ ధర రూ.10,999 మాత్రమే.

లెనోవో కె10 ప్లస్‌ స్మార్ట్ ఫోన్ 6.22 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ పై ఆధారపడి పని చేస్తుంది. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 చిప్‌సెట్లతో రూపుదిద్దుకున్న కేలెనోవో 10 ప్లస్ 13 ఎంపీ+8 ఎంపీ+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది.

ఇంకా 16 ఎంపీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా అంతర్గత మెమొరీని 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 4,050 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.

భారత్‌ ఏటీఎంలలో ‘వాన్న క్రై’ గ్రూప్‌ వైరస్‌ ?

రెండేళ్ల క్రితం అమెరికా, బ్రిటన్‌ను గడగడలాడించిన ‘వాన్న క్రె’ కంప్యూటర్‌ వైరస్‌ ఉదంతం గుర్తుందా..? ఏదేని కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి దాని యజమాని లేదా యూజర్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేందుకు సృష్టించే సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాన్‌సమ్‌ వేర్‌ సృష్టించింది లాజరస్‌ గ్రూపు. తాజాగా ఈ గ్రూప్ భారత ఏటీఎంల వినియోగదారులపైనా కన్నేసిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరకొరియా నిఘా సంస్థ నియంత్రణలోని రాన్సమ్ ఉత్తర కొరియా ప్రధాన ఇంటెలిజెన్స్‌ బ్యూరో నియంత్రణలోని ఈ గ్రూపు.. భారత ఏటీఎంలలోకి అక్రమంగా చొరబడి, కస్టమర్ల కార్డు వివరాలను దొంగిలించేందుకు ‘ఏటీఎం డీట్రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ (వైరస్‌ సాఫ్ట్‌వేర్‌)ను సృష్టించినట్లు సైబర్‌ సెక్యూరిటీ సేవల సంస్థ కాస్పర్‌స్కీ వెల్లడించింది. గత ఏడాది మన ఏటీఎంలలో దీన్ని గుర్తించినట్లు సంస్థ తెలిపింది.

click me!