ఐయూసీ చార్జీల సాకు.. జియోను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థి సంస్థలు

By narsimha lodeFirst Published Oct 15, 2019, 11:45 AM IST
Highlights

కస్టమర్లను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఐయూసీ చార్జీల రూపంలో నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు జియో చేసిన ప్రకటనపై ప్రత్యర్థి సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగాయి.

టెలికాం సంస్థల ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ (ఐయూసీ)తో ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై నిమిషానికి 6 పైసలు వసూలు​ చేయనున్నట్లు రిలయన్స్​ జియో ప్రకటించింది. ఈ ప్రకటనతో సోషల్ మీడియా వేదికగా టెలికాం సంస్థల మధ్య యుద్ధం​ నడుస్తోంది.

దిగ్గజ టెలికాం సంస్థలు ఒకరిపై ఒకరు పోస్ట్​లు పెడుతూ ట్రోల్​ చేసుకుంటున్నాయి. ఇక ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా జియో సంచలనం సృష్టించింది.

ఇక నుంచి కాల్​ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు రిలయన్స్ జియో ఇటీవలే ప్రకటించింది. టెలికాం సంస్థల ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ చార్జ్​ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు ఛార్జ్​ చేయనున్నట్లు తెలిపింది.

ఐయూసీ ఛార్జీలు విధిస్తున్నట్లు జియో ప్రకటించటాన్ని అదునుగా తీసుకున్న ఇతర నెట్​వర్క్​లు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా వంటివి సోషల్ మీడియా వేదికగా ట్రోల్​ చేస్తున్నాయి. జియో నుంచి తమ నెట్​వర్క్​లోకి వచ్చేయండంటూ ట్విట్టర్​ వేదికగా పలు పోస్టులు పెట్టాయి.

వొడాఫోన్​ ట్వీట్​ఐయూసీ ఛార్జీలపై ఇతర నెట్​వర్క్​లు చేస్తున్న రాద్ధాంతానికి దిమ్మదిరిగే షాక్​ ఇచ్చింది రిలయన్స్​ జియో. ట్రాయ్​ నిబంధనల మేరకు ఇతర నెట్​వర్క్​లకు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చందని పేర్కొంది.

ఇతర టెలిఫోన్ ఆపరేటర్ల వల్లే నిమిషానికి 6 పైసలు వసూలు చేయాల్సి వస్తోందని రిలయన్స్ జియో చెప్పుకొచ్చింది. ఎయిర్​టెల్​ను 'ఎయిర్​ టోల్'​ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది. వొడాఫోన్​-ఐడియాపైనే ఇలాంటి మాటల తూటాలే సంధించింది.

జియో తన ప్రత్యర్థుల్ని విమర్శించే పోస్టుల్ని ఆయా సంస్థల థీమ్​ కలర్​తోనే రూపొందించింది జియో. దీనిపై ఎయిర్​టెల్​ సరదాగా స్పందించింది. 'మా థీమ్ కలర్​లో నువ్వు చాలా బాగున్నావ్​' అంటూ జియో ట్వీట్​కు రిప్లై ఇచ్చింది.

click me!