దక్షిణ కొరియా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ పేరిట కొత్త వేరియంట్‌ను తేవాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో ఇంకా ఆవిష్కరించని గెలాక్సీ ఏ 91 ఫోన్ మాదిరిగానే 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో దీని ధర రూ.58,805 వరకు ఉండొచ్చునని అంచనా.
శామ్‌సంగ్ ఎస్10 లైట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్+ 5 ఎంపీ డెప్త్ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ డివైజ్ అందుబాటులో ఉంటుంది.