డిజిటల్​ ఇండియాలో 'గూగుల్ ' భాగస్వామి

By narsimha lode  |  First Published Sep 1, 2019, 12:14 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్రం రూపొందించిన కార్యక్రమం 'బిల్డ్​ ఫర్ డిజిటల్​ ఇండియా'లో గూగుల్ సంస్థ భాగస్వామి కానున్నది. ఈ మేరకు టెక్​ దిగ్గజంతో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందంపై సంతకాలు చేసింది. 


ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకునే వేదికే బిల్డ్​ ఫర్ డిజిటల్​ ఇండియా థీమ్. డిజిటల్​ ఇండియా నిర్మాణంలో ఇక నుంచి గూగుల్ పాలుపంచుకోనుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. 

దేశంలోని ఇంజినీరింగ్​ విద్యార్థులు తమ ఆలోచనలను వ్యక్త పరిచే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Latest Videos

undefined

"దేశంలోని అన్ని ఇంజినీరింగ్​ విద్యార్థులకు అన్ని విషయాల్లో సహాయం అందిస్తుంది. ఐఐటీతో పాటు సాధారణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, నూతన సాంకేతికతను అలవడేలా గూగుల్ కృషి చేస్తుంది. ఇందుకు గూగుల్​ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ చెప్పారు.

ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, స్మార్ట్​ సిటీస్, మౌలిక సదుపాయాలు, మహిళల భద్రత, రవాణా, పర్యావరణం, డిజిటల్ అక్షరాస్యత ఇలా చాలా అంశాలను పొందుపరిచారు. విద్యార్థులు మెషీన్​ లెర్నింగ్, క్లౌడ్, ఆండ్రాయిడ్ సాంకేతికతలను నేర్చుకునేందుకు గూగుల్​ సంస్థ సహకరిస్తుంది. 

గూగుల్ డెవలపర్ స్టూడెంట్ క్లబ్ నెట్​వర్క్ ద్వారా ఈ అంశాలను ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ వేదికల్లో నేర్చుకునేందుకు వీలు కల్పిస్తారు. ప్రొడక్ట్​ డిజైన్, సాంకేతికతకు రంగాల్లో మెంటార్​షిప్​ సెషన్స్​ కూడా నిర్వహిస్తుంది.
 

click me!