త్వరలో భాగ్యనగరిలో అతిపెద్ద ‘ఇంక్యుబేటర్’

By Siva Kodati  |  First Published Jun 9, 2019, 11:19 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌ ‘టీ హబ్ ఫేజ్ -2’ నిలువనున్నది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న టీ హబ్ స్టార్టప్‌లకు చక్కని వేదిక కానున్నదని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు.


తెలంగాణ రాజధాని ‘భాగ్యనగరం’ మరో చరిత్ర నెలకొల్పేందుకు సిద్ధం అవుతోంది. టీ-హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా నిలుస్తుందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. 

శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ స్టార్టప్ కాన్‌క్లేవ్ హెచ్‌ఎస్‌ఎక్స్ -2019లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 

Latest Videos

undefined

దీన్ని ఐఐఐటీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, టీహబ్, హెడ్ స్టార్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో దాదాపు 600కి పైగా పెట్టుబడిదారులు, దేశంలోని 23 రాష్ర్టాల ప్రభుత్వ అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లకు టీ-హబ్ ద్వారా చక్కని వేదికను అందించిందన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అందుబాటులో ఉన్న టీ-హబ్‌కు ధీటుగా రూ.300 కోట్లతో టీ-హబ్ ఫేజ్-2ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుత టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని, ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రాగలదని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. దేశంలోనే అధిక స్టార్టప్ సంస్థలున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని పొందుతున్నదన్నారు. 

స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నిధి ఏర్పాటుకూ కృషి చేస్తున్నదని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కలిగిన రాష్ర్టాలకు ర్యాంకులు ఇస్తున్నదదన్నారు. 

హైదరాబాద్‌లో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని జయేశ్ రంజన్ తెలిపారు. దేశీయంగా స్టార్టప్‌లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సరికొత్తగా టీ-బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 

దీని ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచ మార్కెట్లతో సత్ససంబంధాలు నెలకొంటాయని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. టీ-బ్రిడ్జ్ ద్వారా ఇప్పటికే 100కుపైగా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ సేవలను అందిస్తున్నాయని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో 40కిపైగా జాతీయస్థాయి పరిశోధన ల్యాబ్‌లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. స్టార్టప్‌లు చిన్నపాటి బహుళజాతి సంస్థలుగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు.

టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 వేల స్టార్టప్‌లు ఉన్నాయని, దేశీయ స్టార్టప్‌లలో ఇవి 15-20 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలకు వీటి ద్వారా పరిష్కారం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.  

టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 వేల స్టార్టప్‌లు ఉన్నాయని, దేశీయ స్టార్టప్‌లలో ఇవి 15-20 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలకు వీటి ద్వారా పరిష్కారం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.  

click me!