ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా తన 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ .7 వేలు తగ్గింపును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఎయిర్‌టెల్ ఆఫర్ కూడా ఉంది. వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ నోకియా నుంచి లభిస్తోంది.
నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరలను ప్రకటించింది. నోకియా 8.1 ను రాయితీ ధరల్లోఅందుబాటులోకి తీసుకొచ్చింది. బేసిక్ వేరియంట్ ఫోన్ ధర 64 జీబీ ర్యామ్ స్టోరేజ్‌తోపాటు 4జీబీ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
హై ఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ డివైస్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెండు ఫోన్లపై రూ. 7000 వరకు ధర తగ్గించాలని నోకియా నిర్ణయించింది.
undefined
నోకియా 8.1 ఫోన్.. 4 జీబీర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఫోన్ లాంచింగ్ ధర రూ. 26,999గా నిర్ణయించారు. కానీ ధర తగ్గింపుతో ప్రస్తుతం ఆ ఫోన్‌ను రూ. 19.999లకు అందుబాటులోకి వచ్చింది.
6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల లాంచింగ్ ధరగా రూ. 29,999గా నిర్ణయించింది. రాయితీతో ప్రస్తుత ఆ ఫోన్ రూ. 22,999లకే అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ కస్టమర్లలో యూజర్లకు ప్రీ పెయిడ్ రూ.199 రీచార్జ్ కూపన్‌పై ఒక టీబీ 4జీ డేటా అదనం. రూ.499 లకుపైన రీచార్జీ చేసుకునే పోస్ట్ పోయిడ్ యూజర్లకైతే 120 జీబీ డేటా అదనం.
అలాగే మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచితం. అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు ఉచితం. అంతేకాదు రూ.4000 విలువైన స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అవకాశం (ఒకసారి) కూడా కల్పిస్తోంది.
నోకియా 8.1 ఫోన్‌లో 6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు 1080 x 2244 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంటుంది. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్, 13 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు చేర్చారు.