పాత ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి హెచ్చరిక. గూగుల్ తన ప్లే స్టోర్‌లో 85 యాప్స్ ను తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి మాల్ వేర్ తీసుకొస్తున్నాయని, యూజర్లకు ఇబ్బందికరంగా మారాయని పేర్కొంది.
టెక్ దిగ్గజం గూగుల్ తన ప్లేస్టోర్‌లోని 85 యాప్‌లను తొలగించింది. భద్రతా కారణాల రీత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. యాడ్‌వేర్ అనే మాల్‌వేర్ రకం వైరస్ ఈ యాప్‌లలో ఉందంటూ ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించింది.
దీంతో గూగుల్ వాటిని తొలగించింది. ఇవి అననుకూల యాడ్‌లను చూపడమేగాక, వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయని గూగుల్ తెలిపింది. తొలగించిన యాప్‌లలో ఎక్కువగా ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
undefined
వీటిని ఇప్పటికే 80 లక్షల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారని గూగుల్ పేర్కొంది. వీటిలో సూపర్‌సెల్ఫీ, కాస్ కెమెరా, వన్ స్ట్రోక్ లైన్ పజిల్, పాప్ కెమెరా లాంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయి.
ఈ యాప్‌లను ప్లేస్టోర్‌లో వివిద ప్రాంతాలనుంచి అప్‌లోడ్ చేసినా.. అవి అన్నీ ఒకే రీతిలో ప్రవర్తిస్తుండటంపై అనుమానం వ్యక్తం చేసింది. వాటి పనితీరు ఒకే విధంగా ఉంటూ ఆందోళన కలిగించిందని తెలిపింది. ఈ యాడ్‌వేర్ పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించిందని గూగుల్ పేర్కొంది.