గూగుల్ విడుదల చేయనున్న పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లన్నీ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ‘యూ ట్యూబ్’ వేదికగా ఈ ఫోన్లు ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీన న్యూయార్క్‌లో దీనికోసం భారీ హార్డ్ వేర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గూగుల్ కూడా పిక్సెల్ 4 గురించి టీజ్ చేస్తోంది.
ఈ ఫ్లాగ్ షిప్ ఫీచర్లు మొబైల్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్నింటిని గూగుల్ వెల్లడించింది. మరికొన్ని లీక్‌ల రూపంలో బయటపడ్డాయి.
undefined
ఈ మొబైల్స్ ధరపై ఎటువంటి సమాచారం లేకున్నా పిక్సెల్ 4 సిరీస్‌లో ప్రత్యేకంగా ‘ఆరెంజ్ వేరియంట్’ ఫోన్ తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇది ఐ-ఫోన్ 11 కంటే ఎక్కువ ధర ఉంటుందని వినికిడి.
పిక్సెల్ 4 సిరీస్ మొబైల్ ఫోన్లో ‘సోలి’ అనే మోషన్ సెన్సింగ్ రాడార్ ఫీచర్ కూడా తీసుకువస్తున్నారని ఇప్పటికే తెలిసింది. ఈ మేరకు గూగుల్ ఒక వీడియో కూడా విడుదల చేసింది.
దాని ప్రకారం సైగలతోనే పాటల ట్రాక్ మార్చడం, అలారం ఆపడం, కాల్స్ సైలెంట్ చేయడం వంటి పనులు సాగించొచ్చు. ఈ మోషన్ సెన్సింగ్ ద్వారా ఫేస్ అన్ లాక్ ఆఫ్షన్ కూడా అందుబాటులోకి రానున్నది. దీని ప్రకారం కొత్త పిక్సెల్ మొబైల్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండకపోవచ్చు.
పిక్సెల్ 4 సిరీస్ మొబైల్ ఫోన్లలో ‘పిక్సెల్ న్యూరల్ కోర్’ అనే టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. పిక్సెల్ 3లో క్లాస్ లీడింగ్ కెమెరాకు ఇది అప్ డేటెడ్ వర్షన్ అని చెబుతున్నారు. దీనివల్ల ఈ మొబైల్ ఫోన్లలో ఫోటోలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని సమాచారం.
దీంతోపాటు ఈ మొబైల్ ఫోన్లలో ట్రాన్స్ క్రిప్షన్ సెంట్రిక్ రికార్డింగ్ యాప్ కూడా చేరుస్తున్నారు. దీని ద్వారా కారు ప్రమాదాలను తేలిగ్గా గుర్తించొచ్చు.
ఈ మొబైల్ ఫోన్ గల వ్యక్తి లేదా వాహనం క్రాష్ అయితే వెంటనే డిటెక్స్ చేసి సమాచారం చేరవేస్తుంది. ఆపిల్ వాచ్ తరహా ఈ ఫీచర్ ఇప్పటికే ఉంది. ఇక పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లను 5జీ వెర్షన్‌లోనూ తీసుకొచ్చేందుకు సెర్చింజన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.