డేటా నిల్వ చేయడానికి కొత్త ఆయిల్ కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లైగ్ గట్టి కౌంటరిచ్చారు. దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదని, సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలని పేర్కొన్నారు.
డేటా విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటనపై ఫేస్‌బుక్ భిన్నంగా స్పందించింది. డేటా అంటే కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్‌క్లెగ్ పేర్కొన్నారు.
భారత్ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపేయకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అభిప్రాయపడ్డారు.
undefined
‘జాతి భద్రత దృష్ట్యా భారత్ వంటి దేశాలకు డేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు, ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్ గొప్ప చర్యలే చేపట్టింది’’ అని క్లెగ్ గుర్తు చేశారు.
‘తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్‌కు భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి’’ అని నిక్‌క్లెగ్ అన్నారు.
డేటాను ‘న్యూ ఆయిల్’ (కొత్త ఇంధనం) అని, సామాజిక మాధ్యమ వేదికలు, ఇంటర్న్‌పై భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే వ్యాఖ్యానించారు.
‘దేశీయ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాలి. అది దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు కాదు’ అని అంబానీ పేర్కొన్నారు. ‘భారత్‌లో చాలా మంది, ప్రపంచ వ్యాప్తంగా డేటాను కొందరు కొత్త ఆయిల్‌గా భావిస్తున్నారు.
దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక పొరపాటే అవుతుంది’ అని క్లెగ్ గురువారం ఓ మీడియా సంస్థకు తెలిపారు.
‘నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదు. దాన్ని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలి’’ అని నిక్ క్లేగ్ సూచించారు. డేటాను దేశీయంగానే నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చేర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.