తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి రెక్కల్లేని ఫ్యాన్లు: ప్రత్యేకతలివే

By rajashekhar garrepallyFirst Published Apr 24, 2019, 1:32 PM IST
Highlights

అమెరికాకు చెందిన ఎక్స్‌హాల్ కంపెనీ తయారు చేసిన రెక్కలు లేని సరికొత్త ఫ్యాన్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి తెలుగు రాష్ట్రాల అధీకృత డీలర్‌గా వ్యవహరిస్తున్న డోమెక్ సొల్యూషన్స్ ప్రవేశపెట్టింది. 

హైదరాబాద్: అమెరికాకు చెందిన ఎక్స్‌హాల్ కంపెనీ తయారు చేసిన రెక్కలు లేని సరికొత్త ఫ్యాన్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి తెలుగు రాష్ట్రాల అధీకృత డీలర్‌గా వ్యవహరిస్తున్న డోమెక్ సొల్యూషన్స్ ప్రవేశపెట్టింది. 

సాధారణ సీలింగ్ ఫ్యాన్‌కు ఉండే రెక్కలు లేకుండా సీలింగ్‌కు ఒక డిజైన్‌లా ఈ ఫ్యాన్లు ఉంటాయని ఈ సందర్భంగా డోమెక్ సోల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీ రఘురామి రెడ్డి తెలిపారు. ఒకసారి ఫ్యాన్ ఆన్ చేశాక.. గదిలో ఉన్న గాలినంతా అది తీసుకుని, దాన్ని శుద్ధి చేస్తుందని, ఆ తర్వాత 360 డిగ్రీల కోణంలో పంపిణీ చేయడం దీని ప్రత్యేక అని వివరించారు.

ఏసీని కొద్ది సేపటి తర్వాత ఆపేసినా.. గదిలో 8గంటల పాటు అదే ఉష్ణోగ్రత నిలిపి ఉంచేందుకు ఈ ఫ్యాన్ దోహదపడుతుందని తెలిపారు. రెండు మోడళ్లలో లభించే ఈ ఫ్యాన్ ధర ఎల్ఈడీతో రూ. 25,600, ఎల్ఈడీ లేకుండా అయితే రూ. 23,500 అని చెప్పారు. 

వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో తమ ప్రాంఛైజీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామన్నారు. చెన్నైలో ఉత్పత్తి అవుతున్న ఈ ఫ్యాన్లు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని ఎక్స్ హాల్ ఇన్నోవేషన్స్ వరల్డ్ వైడ్ ఎండీ ప్రేమ్ కుమార్ తెలిపారు. నెలకు 10వేలు ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

click me!