2019 ఏప్రిల్-జూన్ మధ్య దేశీయంగా మొదటి శ్రేణి నగరాల్లో చెన్నై నగర పరిధిలో అత్యధికంగా 48 శాతం సైబర్ దాడులు జరిగాయి.
దేశవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్ యూజర్ సైబర్ దాడులకు గురవుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సైబర్‌దాడులు వేగంగా పెరుగుతున్నట్లు ఈ సర్వే తెలిపింది.
ప్రత్యేకించి తమిళనాడు రాజధాని చెన్నై మెట్రోపాలిటన్ నగర వాసుల్లో అత్యధికంగా సైబర్ దాడులకు గురయ్యారు. ఎంటర్ ప్రైజెస్, మొబైల్, మాక్, విండోస్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ)లపై ఎక్కువగా సైబర్ దాడులు ప్రభావం చూపుతున్నాయి.
undefined
దేశంలో ఇంటర్నెట్ యూజర్లపై ఇటీవల సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్ యూజర్ సైబర్ దాడుల బారీన పడ్డాయని ఓ సర్వే వెల్లడించింది.
'సైబర్ నేరాల నిఘా' పేరుతో కే7 కంప్యూటింగ్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు తెలిశాయి.ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గువహటి, పాట్నా నగరాల్లో ఈ సైబర్ దాడులు అధికంగా జరుగుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య మూడు నెలల మధ్య పాట్నా, చెన్నైలలో అత్యధికంగా 48 శాతం సైబర్ దాడులు జరిగాయి. గువహటిలో 46 శాతం, లక్నోలో 45 శాతం, కోల్‌కతాలో 41 శాతం సైబర్‌దాడులు నమోదయ్యాయి.
ఢిల్లీలో అత్యల్పంగా 28 శాతం సైబర్ దాడులు జరిగాయని సర్వేలో తేలింది. కేరళ రాజధాని తిరువనంతపురం పరిధిలో 35 శాతం సైబర్ దాడులు జరిగాయి.
వ్యాపార సముదాయాలు, స్మార్ట్ ఫోన్లు, విండోస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లపై దేశవ్యాప్తంగా 20 పట్టణాల్లో ఈ సర్వే జరిగింది. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైబర్ దాడులు వేగంగా పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
కే7 కంప్యూటింగ్ సీఈఓ కే పురుషోత్తమన్ మాట్లాడుతూ ‘కే7 కంప్యూటింగ్ కే ల్యాబ్స్ సైబర్ దాడులను నియంత్రణకు చర్యలు తీసుకున్నది’ అని తెలిపారు.
ట్రోజాన్ దాడుల్లో 72 శాతం మ్యాక్ కంప్యూటర్లపై ప్రభావం చూపాయి. యాడ్ వేర్ 18 శాతం, పొటెన్షియల్లీ అన్ వాంటెడ్ ప్రోగ్రామ్స్ లేదా పొటెన్షియల్లీ అన్ వాంటెడ్ అప్లికేషన్స్ పై 9 శాతం దాడులు జరిగాయి. రూటర్లు, ప్రింటర్లు, ఎన్ఎస్ఎస్, ఐపీ కెమెరాలు, మీడియా ప్లేయర్లు, సెట్ టాప్ బాక్సులు, స్మార్ట్ టీవీలపైనా సైబర్ దాడులు జరిగాయి.