ఇక ‘వెబ్‌’లోనూ ఎయిర్‌టెల్ టీవీ సేవలు: ఇలా పొందండి

By rajashekhar garrepally  |  First Published May 6, 2019, 6:33 PM IST

తన వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఓ మంచి వార్తను అందించింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలను.. ఇకపై వెబ్‌ వెర్షన్‌లోనూ అందించనుంది. 


తన వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఓ మంచి వార్తను అందించింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలను.. ఇకపై వెబ్‌ వెర్షన్‌లోనూ అందించనుంది. 

దీంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ ఫాంలపైనే కాకుండా.. ఇకపై డెస్క్ టాప్/ల్యాప్‌టాప్/టాబ్లెట్ ద్వారా వెబ్ బ్రౌజర్లలో ఎయిర్‌టెల్ టీవీ సేవలను వినియోగదారులు పొందవచ్చు. 

Latest Videos

undefined

ప్రస్తుతం ఎయిర్‌టెల్ టీవీ వెబ్ వెర్షన్‌లో పరిమితమ సంఖ్యలో మాత్రమే వీడియోలు, ఇతర లైవ్ టీవీ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో అన్ని వీడియో సబ్ స్క్రిప్షన్ సర్వీసులు, లైవ్ టీవీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. 

ఎయిర్‌టెల్ టీవీ సేవలు పొందడం ఎలా?

ఎయిర్‌టెల్ టీవీ వెబ్ సేవలు పొందడానికి మొదటగా వినియోగదారులు https://www.airtelxstream.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఆ తర్వాత వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేయగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరీఫై చేయడంతో సభ్యత్వ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం ఎయిర్‌టెల్ టీవీ సేవలను పొందవచ్చు.

click me!