అదృశ్యం కేసు: హైదరాబదులో తేలిన తోటికోడళ్లు, పిల్లలు

Published : Nov 20, 2020, 08:16 AM IST
అదృశ్యం కేసు: హైదరాబదులో తేలిన తోటికోడళ్లు, పిల్లలు

సారాంశం

మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో అదృశ్యమైన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాదులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని హైదరాబాదు నుంచి వెంకటగిరికి తరలిస్తున్నారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు కుటుంబ సభ్యులు తెలంగాణ రాజధాని హైదరాబాదులో కనిపించారు. ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి ఇద్దరు తోటి కోడళ్లు ముగ్గురు పిల్లలతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో గల తమ ఇంటి నుంచి వారు ఇంటి నుంచి ఆటోలో బయటకు వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం. ఇచ్చారు. దాంతో పోలీసు గత మూడు రోజులుగా వారి కోసం గాలిస్తు వచ్చారు. 

చివరకు వారు హైదరాబాదులో ఉన్నట్లు కనిపెట్టారు. వారిని పోలీసులు హైదరాబాదు నుంచి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి తరలిస్తున్నారు. వారు హైదరాబాదు ఎందుకు వెళ్లారనే విషయంపై పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. 

పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో వైద్యులకు చూపిస్తామని ఇద్దరు మహిళలు పిల్లలతో బయటకు వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Road Accident in Nellore: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు మృతి
మహిళకు నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యదర్శి వేధింపులు