నెల్లూరులో దారుణం... మోసపోయి గర్భందాల్చిన పదిహేనేళ్ల బాలిక

Arun Kumar P   | Asianet News
Published : Sep 29, 2020, 08:50 AM IST
నెల్లూరులో దారుణం... మోసపోయి గర్భందాల్చిన పదిహేనేళ్ల బాలిక

సారాంశం

కామాంధుడి కామ వాంఛకు బలయిన  15ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. 

నెల్లూరు: పదిహేనేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కామాంధుడి కామ వాంఛకు బలయిన యువతి గర్భం దాల్చడంతో ఈ దారుణం గురించి బయటడింది. 

వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం వేముగుంటపాలెం గ్రామానికి చెందిన ఓ పదిహేనేళ్ల బాలికపై అదే గ్రామానిక చెందిన సోమశేఖర్ అనే యువకుడి కన్ను పడింది. దీంతో అమాయకురాలయిన బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న అతడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. 

read more  పిల్లల కోసం చిచ్చుపెట్టాడు : కర్నూల్‌లో విగ్రహం ధ్వంసం వెనుక అసలు కథ ఇదీ....

కడుపులో నొప్పిగా వుందని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. పరీక్షలు నిర్వహించగా ఆరు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక అసలు విషయాన్ని బయటపెట్టడంతో ఆమె తల్లిదండ్రులు సోమశేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురు జీవితంతో ఆడుకున్న యువకుడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Road Accident in Nellore: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా ఆరుగురు మృతి
మహిళకు నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యదర్శి వేధింపులు