డ్యాములు నిండాయి... ఇక భూములు కూడా నిండుతాయి: మంత్రి అనిల్

By Arun Kumar PFirst Published Oct 14, 2019, 4:22 PM IST
Highlights

రైతులకు మేలుచేసే బృహత్తర కార్యక్రమం రైతు భరోసాను నెల్లూరు జిల్లానుండి ప్రారంభించడపై స్థానిక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.  

అమరావతి: జగన్మోహన్ రెడ్డి వంటి  మనసున్న మారాజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే రాష్ట్రంలో భారీగా వర్షాలు పడినట్లు నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని డ్యాములన్ని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. ఇలా సమృద్దిగా వున్న నీటితో రైతలు పంటలు పండించుకోడానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నట్లు మంత్రి తలిపారు. ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతుకు పెట్టుబడి సాయం అందించాలనుకున్న  మొదటి నాయకుడు జగనేనని... 2015 లోనే అతడు ఈ పథకం గురించి ప్రస్థావించినట్లు తెలిపారు. దేశంలో కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేసిన ప్రభుత్వం  తమదేనని అన్నారు. వ్యవసాయ మిషన్ సభ్యులు మల్లారెడ్డి సూచన మేరకే దశల వారి రైతు భరోసా చేయాలని సీఎం అంగీకరించినట్లు వెల్లడించారు. 

గతంలోనే రైతుకు పెట్టుబడి సాయం అందించి మేలు చేయాలని జగన్ ఆలోచిస్తే... రైతులకు ఏ విధంగా నష్టం చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం చేసింది.పెట్టుబడి సాయం అనేది సీజన్ల వారీగా ఇస్తే బాగుంటుందని రైతు ప్రతినిధులు కూడా కోరారు.

అర్హత కలిగిన ఒక్క రైతు కూడా ఈ పథకం నుండి ఎలిమినేట్ కాకూడదనే ఆలోచన ప్రభుత్వానికుందన్నారు. పంట మార్కెట్టుకు వచ్చే నాటికే కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు  చేయనున్నట్లు తెలిపారు. మిల్లెట్, పల్సెస్, ప్యాడీ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్దితో వుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.  
 

click me!